Showing posts with label నా స్పందన. Show all posts
Showing posts with label నా స్పందన. Show all posts

Monday, November 12, 2007

గబ్బర్‌సింగు రాజ్యం ! బగ్గంపాడు భాగ్యనగరం !

పెళ్ళిచెయ్యడానికొచ్చిన పురోహితుడు పెళ్ళికూతుర్ని లేవదీసుకుపోతే ?

వీలునామా దాచమని ఇచ్చిన న్యాయవాదే ఆస్తి కాజేస్తే ?

చికిత్స చేస్తానని చెప్పి శరీరాంగాల్ని వైద్యుడు దొంగిలిస్తే ?

కిరాయిదారుడే యజమాని ఇంటిని అమ్మేస్తే ?

నవ్వుకుంటున్నారా ? ప్రస్తుతం ఆంధ్రదేశ రాజధానిలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కఱలేదు.ఆశ్చర్యపోయేవాడు అమాయకుడు.సరిగ్గా ఇవే కాకపోయినా ఇలాంటి సంఘటనలు ఇక్కడ పెచ్చుమీరిపోతున్నాయి.హైదరాబాదుకు ఈ దుర్గతి గత ఏడేళ్ళుగా పట్టింది.ఇది ముందు ప్రైవేటు/సహకార బ్యాంకులు వరస-వరసగా మూతపడ్డంతో ఆరంభమైంది.తెలుగుదేశం ప్రభుత్వపు నిష్క్రియాపరత్వం పుణ్యమా అని ఇల్లడదార్ల(depositors)కు చెందిన వందలాది కోట్ల రూపాయల డబ్బు స్వాహా చేసి హాయిగా తిరగ్గలమనే భరోసా వచ్చాక ప్రతివాడికీ పాపపుణ్యాల మీద నమ్మకం చచ్చింది.శేఖర్‌దాదా అధికారంలోకొచ్చాక అసలు వ్యవస్థ మీదే నమ్మకం చచ్చిపోతోంది.

రెండు లక్షలమంది బందిపోట్లు ఒకేసారి రాష్ట్రంలో ప్రవేశిస్తే ఏమవుతుంది ? ఒకవేళ వాళ్ళ నాయకులు ఇళ్ళమీదికి కాక ముందస్తుగా రాష్ట్ర సచివాలయానికీ శాసనసభకూ వెళ్ళి అక్కడ తిష్ఠ వేస్తే ఏం జరుగుతుంది ? అసలు గబ్బర్‌సింగే స్వయంగా రాష్ట్రంలో అత్యున్నత అధికారపీఠాన్ని అధిష్ఠిస్తే ఏమవుతుంది ?

ఏదీ ఊహించుకోనక్కఱలేదు.అన్నీ తేటతెల్లంగా కళ్ళముందే చకచకా జరిగిపోయాయి గనుక.మొన్నమొన్నటిదాకా ఔటర్‌రింగురోడ్డు పేరుతో పేదరైతుల భూములు కాజేశారు.తరువాత తన అక్రమ ఆస్తుల్ని బయటపెట్టాల్సి వచ్చేసరికి ఒక పెద్దాయన రాష్ట్రంలో ఉన్నవన్నీ అసైన్డు భూములేనని రెవిన్యూ శాఖవాళ్ళచేత చెప్పించడం మొదలుపెట్టాడు.ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడం కోసం కూడా వాళ్ళవి అసైన్డు భూములని ప్రకటించడం ఆనవాయితీ అయిపోయింది.

ఇక ఇప్పుడు మధ్యతరగతివాళ్ళ భూముల మీద పడ్డారు.నిజానికి ఇవి భూములు కావు.ఇళ్ళ స్థలాలు.ఇవి ఎవరూ వాళ్ళకు ఉచితంగా ఇచ్చినవి కావు.చచ్చీ చెడీ పొదుపుచేసి కొనుక్కుని దశాబ్దాల క్రితమే రిజిస్ట్రేషను కూడా అయిపోయినవి.ఇలాంటి స్థలాలున్న దాదాపు 3,700 ఎకరాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.ఇవన్ని ఎక్కడో ఊరి చివర ఉన్న భూములు కావు.ఇవి గ్రేటర్ హైదరాబాదు నడిబొడ్డున ఉన్నవి.విచిత్రమేంటంటే వీటిల్లో అధికభాగం భూములు ఇప్పటికే వ్యాజ్యాల్లో ఉన్నాయి.ఆ వ్యాజ్యాలు తెగకుండానే ఆ భూములు కావాలనడం - అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత తొందరలో ఉన్నారో, ఎన్నికల గడువు వాళ్ళని ఎలా తరుముకొస్తోందో తొమ్మిదేళ్ళ సుదీర్ఘ ఆకలి వాళ్ళకి ఎలా నిద్రపట్టకుండా చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కాజేస్తారు.తరువాత కట్టిన ఇళ్ళూ అపార్ట్‌మెంట్లూ కూడా ఏదో ఒక వంకన కూల్చేసి ఆ స్థలాలు కూడా లాక్కుంటామంటారు.అప్పుడు మధ్యతరగతివాళ్ళ పని అయిపోయాక జూబిలీ మఱియు బంజారా కొండల్లో ఉండే సంపన్న ప్రత్యర్థుల మీద పడతారు.

"హైటెక్ నాయుడు మనకొద్దు, రైతురాజ్యం తెస్తా"మంటే"ఓహో ! కామోసు"అనుకున్నాం, - వాళ్ళకు భూముల మీద ఇంత కరకర కాలే ఆకలి ఉంటుందని తెలియక.రైతులంటే పాపం ! భూమిపుత్రులు, భూమిని నమ్ముకుని బతికేవాళ్ళు అనుకున్నాం.కాని వీళ్ళు మాత్రం భూముల్ని అమ్ముకుని బతికేవాళ్ళనీ, అందులోను తమ భూములు కాక ఇతరుల భూముల్ని ప్రభుత్వ నోటిఫికేషన్ల పేరుతో ఆక్రమించుకుని మఱీ అమ్ముకునేవాళ్ళనీ ఇప్పుడు అర్థంచేసుకుంటున్నాం.ఇప్పుడు తెలిసొస్తోంది, జన్మజన్మలకీ వద్దురా బాబూ ఈ రైతురాజ్యమనిపించేలా.హైటెక్ బాబంటూ నాయుడుగారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవాళ్ళు ఇప్పుడు అదే హైటెక్ పేరుతో నోటిఫికేషన్లు జారీచెయ్యడమే విస్మయజనకం.

మోసాలూ, ఆక్రమణలూ, అన్యాయాలూ మానవజాతి పుట్టినప్పటినుంచే ఉన్నాయనుకున్నా, తన రాజముద్ర ఉన్న కాయితాలు చెల్లవని ఒక ప్రభుత్వం పదే పదే ప్రకటించడం, తన నోటిఫికేషన్లు రాజ్యాంగాని కతీతమన్నట్లు ప్రవర్తించడం ఏ భయంకర అక్రమ అరాచకానికి సూచిక ? ఏ చారిత్రిక దశాపరిణామానికి వీళ్ళు తెఱతియ్యబోతున్నారు ? ఎటు వెళుతోందీ ఆంధ్రదేశం ? ఏమిటీ భస్మాసుర హస్తం ? ప్రపంచంలో ఏ ఇతరదేశంలో నైనా దీనికి సరిపోలే సంఘటనలు జరిగాయా ? తెలుసుకోగోరుతున్నాను.

పేదవాళ్ళ దగ్గరా, మధ్యతరగతివాళ్ళ దగ్గరా లాక్కున్న భూముల్ని ఏమని చెప్పి విపణిస్తారు (మార్కెట్ చేసుకుంటారు) ? కొనుక్కునేవాడేమైనా పిచ్చివెధవనుకుంటున్నారా ? అప్పుడు వాళ్ళ దగ్గరి నుంచి లాక్కున్న ప్రభుత్వం తరువాత నా దగ్గరి నుంచి కూడా లాక్కోదని నమ్మకం ఏంటి ? అనే అనుమానం వాడికి రాదా ? అసలు వీళ్ళు రియల్ ఎస్టేట్ ని మనుషుల మనోభావాలతో సంబంధం లేని లంకెబిందెలా ఎలా భావిస్తున్నారు ? రియల్ ఎస్టేట్ వెనక ఉన్నవి కేవలం మనోభావాలే.లేకపోతే ఒక చోట గజం అయిదొందలేంటి ? ఇంకో చోట గజం లక్షరూపాయలేంటి ? మనుషులు అంతెందుకు చెల్లించి కొనుక్కుంటారో ఆలోచించారా ? కొనుక్కున్నదానికి ప్రభుత్వ హామీ ఉంటుందనే నమ్మకం, భవిష్యత్తులో తమ దగ్గర కొనుక్కునేవాళ్ళక్కూడా ఆ హామీ విస్తరిస్తుందనే భరోసా, ఆ ప్రదేశంలో నయితే శత్రుభయం ఉండదనే విశ్వాసం, ఆదాయం ఉంటుందనే హామీ-ఇలా ఎన్నో అంశాలు ఒక స్థలానికి విలువని సమకూర్చిపెట్టడంలో పాత్రపోషిస్తాయి.అవేవీ లేని హైదరాబాదులో స్థలాలు కొనడానికి ఎవరు ముందుకొస్తారు ? ప్రతివాడూ తన స్థలం 50 లక్షలనీ కోటి అనీ రెండు కోట్లని ప్రగల్భాలు పలకడమే తప్ప ఎవడు సిద్ధంగా ఉన్నాడు హైదరాబాదు మీద అంత డబ్బు పోసి దారిన పోయే తద్దినాన్ని తలకు చుట్టుకోవడానికి ?

మగధదేశపు రాజు బింబిసారుడు తన స్నేహితుడైన వంగదేశపు రాజుకు తన ఉద్యానవనాన్ని చూపిస్తానని తీసుకెళ్ళాడు.తాను ఆ ఉద్యానాన్ని ఎంత కష్టపడి అభివృద్ధి చేశాడో, ఏయే దేశాల్నుంచి ఏయే మొక్కలు తెప్పించాడో వివరంగా వర్ణిస్తూ స్నేహితుణ్ణి తోట లోలోపలికి తీసుకెళ్ళాడు.అక్కడ ఒక మూలన రెండెకరాల స్థలం ఆవులతో, పేడతో, పిడకలతో, గడ్డీ గాదంతో చిందరవందరగా ఉంది.అక్కడే ఒక పాత గుడిసె కూడా ఉంది."అందమైన ఈ ఉద్యానానికి ఈ మూల ఇలా ఉంచేశారేమిటి మహారాజా ?"అని ఆశ్చర్యపోయాడు వంగాధీశుడు."అది నా స్థలం కాదు మహారాజా ! ఒక ముసలమ్మది."అన్నాడు బింబిసారుడు."ఆమెకు వేఱేచోట స్థలం చూపించి మీరు దీన్ని కూడా తోటగా మారిస్తే బావుండేది"అన్నాడు వంగాధీశుడు."ఇప్పటికే చాలాసార్లు అడిగి చూశాను మహారాజా ! ముసలిది ఒప్పుకోనేలేదు.చచ్చేదాకా అక్కడే ఉంటానంటోంది.నన్నేం చెయ్యమంటారు ? ఆమె కడతేఱేదాకా ఎదురుచూడ్డం మినహా నాకు మార్గాంతరం లేదు."అన్నాడు బింబిసారుడు.

అవేమో నిరంకుశ రాజఱికాలు.ఇవి ఉదార ప్రజాస్వామ్యాలు.పేర్లు బావున్నాయి కదూ !

Monday, October 29, 2007

అయ్యా, తెల్లవాళ్ళు చెప్పే కాకమ్మ కథలు నమ్మకండి.వాటి మీద ఆధారపడి. ఏమీ రాయకండి. మన దేశం వాళ్ళు కనుక్కున్నవన్నీ ఏ ఆధారాలు లేకుండానే బాబిలోనియన్లకీ రోమన్లకీ గ్రీకులకీ అదీ కుదరకపోతే చైనాకీ ఆపాదించేసి భారతీయులకంటూ ఏమీ లేకుండా చెయ్యడానికి వాళ్ళు 150 ఏళ్ళ పాటు, పాపం ! అహరహం శ్రమించారు. మనమంటే అంత ద్వేషం అసహ్యం చిన్నచూపు ఎందుకంటే మనం అప్పుడు వాళ్ళ బానిసలం కనుక. బానిస గొప్పదనాన్ని యజమాని ఒప్పుకోడు గనక.

ఒక విషయం చెప్పండి ! 9వ శతాబ్దం దాకా సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మనవాళ్ళు జ్యోతిశ్శాస్త్రాలు రాసేశారా ? వేదిక గణితం కనుక్కున్నారా ? యజ్ఞాల కోసం వైదిక రేఖాగణితం కనుక్కున్నారా ? సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మన వాళ్ళు రెండేళ్ళ తరువాత రాబోయే గ్రహణాన్ని సెకండ్లతో సహా లెక్కగట్టి తెలుసుకునే పద్ధతి గురించి తెలియజేశారా ? ఎందుకు బాబూ మీరు తెల్లవాళ్ళ కుట్రలో పాలుపంచుకుంటారు, బాబిలోనియా మధ్య ఆసియా అంటూ దిక్కుమాలిన అనాగరిక జాతులకి మన పూర్వీకుల్ని అన్యాయంగా దాసోహం చేస్తారు ?

Sunday, September 09, 2007

బ్రిడ్జి పక్కకెళ్ళొద్దురా డింగరీ....

పంజాగుట్టలో భూకంపం వచ్చిందా ?
లేదు.

పంజాగుట్టపై బి-52 బాంబర్ విమానాలతో వాయుదాడి జరిగిందా ?
లేదు.

పంజాగుట్టపై అల్‌ఖైదా తీవ్రవాదులు పంజా విసిరారా ?
లేదు.

మఱి పంజాగుట్ట వంతెన (flyover)ఎందుకు కూలిపోయింది ? కిటకిటలాడే నగరం నడిబొడ్డున అంతమంది పచ్చడిపచ్చడిగా తుక్కుతుక్కుగా నలిగి నాశనమైపోవడానికి కారణమేంటి ? కట్టుబడిలో నాణ్యత లేదని నిపుణులు ధ్రువీకరించిన తరువాత కూడా "చల్ మోహనరంగా !"అని కాంట్రాక్టర్ల భుజం తట్టి పచ్చజెండా ఊపిన ప్రభుత్వపెద్దలెవరు ? ఎవడా కాంట్రాక్టరు (Gammon India Limited, Mumbai) ? వాడి కంపెనీని మూసిపారేసి వాడి కాళ్ళూ చేతులూ నఱికి బహిరంగంగా ఉరితియ్యాలి.టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా పరిణమించిన ఈ జాతిద్రోహుల ప్రభుత్వాన్ని వెంటనే దింపి తక్షణం ఎన్నికలు ప్రకటించాలి.

ఇది అవినీతి పెట్టిన టైమ్‌బాంబు బాబూ : హే భగవాన్ ! ఎలాంటివాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు ? అసలీ రాష్ట్రంలో వీళ్ళెలా అధికారంలోకొచ్చారు ? Truth is stranger than fiction అన్నట్లు సినిమాల్లో చూపించే రాజకీయ విలనీ అవినీతి అంతకంటే హెచ్చు మోతాదులో ప్రత్యక్షంగా అనుభవంలోకొస్తున్నాయి.మొన్ననే పాతబస్తీలో ముస్లింజంగ్ వంతెన కూలిపోయింది.ఈమధ్య ఝంఝావతీ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజే దాని ప్రాథమిక నిర్మాణాలు కూలిపోయాయి.నాయుడుగారు కూడా తమ హయాంలో ఎన్నో కట్టించారు.ఒక్కసారి కూడా ఇలా జరగలేదు.

నగరం నడిబొడ్డున చేస్తున్న నిర్మాణం పూర్తికాకముందే ఇలా అఘోరించిందే, ఇక వీళ్ళు జలయజ్ఞం పేరుబెట్టి చేస్తున్న అవినీతి యజ్ఞంలో భాగమైన ప్రాజెక్టులకు ఏ గతి పట్టబోతోందో ? కొంతకాలమాగితేనే గాని తెలియదు.కాంక్రీటు వెయ్యాల్సిన చోట్ల మట్టి తోలుతున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి.ఏ భారీ వరదకో ఆ ప్రాజెక్టులు కొట్టుకుపోతే జిల్లాలకు జిల్లాలే మునిగిపోతాయి.లక్షలాదిమంది కొట్టుకుపోతారు.

హైదరాబాదులో ఇంటి దగ్గర బయలుదేఱితే మళ్ళీ తిరిగొస్తామనే నమ్మకం పూర్తిగా అడుగంటింది.మొన్న జరిగిన పేలుళ్ళ దెబ్బకే ఎన్నో కంపెనీలు తమ హైదరాబాదు ప్రణాళికల్ని అచ్చంగా రద్దుచేసుకున్నాయి.ఇలా ఉన్న పళాన హఠాత్తుగా బ్రిడ్జిలు కూలిపోతూంటాయనే సమాచారం వ్యాపిస్తే అంతర్జాతీయంగా మన పరువు-ప్రతిష్ఠలు ఏం కావాలి ? ఈ సంగతి తెలిస్తే ప్రపంచబ్యాంకు మనకు అప్పులు కూడా ఇవ్వదు.

Sunday, August 26, 2007

గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....

ఈ టపాలో మా తండ్రిగారి కాలం గురించి రాయాలనుకున్నాను.కానీ ఈలోపలే హైదరాబాదులో బాంబులు పేలాయి.కనుక ఇంకా వెనక్కెళ్ళి మన మునుముత్తాతల కాలం గురించి రాయాల్సి వస్తోంది.హతవిధీ !

ఇప్పుడు మన రాజకీయ పరిస్థితి మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోవడానికి ముందు క్రీ.శ.1730లో ఉన్నట్లు ఉంది.ఐ.టి., సాఫ్ట్‌వేరు ఎగుమతులూ-ఇదంతా ఒక చిన్న పార్శ్వం.ప్రజలుగా మనం ఎదిగామని తెలియజేస్తాయి ఇవి.మన నాయకులు మాత్రం ఎదగలేదు.మారలేదు.సుపరిపాలన(good_governance)లేని దేశం మగదిక్కు లేని కొంపలాంటిది.కేవలం సాఫ్ట్‌వేర్లు రక్షించవు.పేలుళ్ళలో చనిపోయినవాళ్ళు ఒక్కొక్కరికీ అయిదులక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడట శేఖర్ దాదా.దుష్పరిపాలన మూలంగా మనం కోల్పోతున్నదానికి ఎవరు చెల్లిస్తారు ఎక్స్‌గ్రేషియా ? ఎంత చెల్లించగలరు ? ఎంతమందికని చెల్లించగలరు ? ప్రభుత్వ గొప్పదనం ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనా వెల్లడి కావాల్సింది ? 1730లో (ఇంగ్లీషువాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి ముందు) మన దేశం ఎలా ఉండేదో గుర్తుచేసుకోవడం అవసరం.

అప్పట్లో మొఘల్ రాజవంశపు అధికార పరిధి ఢిల్లీ నగర సరిహద్దుల వరకు మాత్రమే చెల్లేది.దేశమంతటా పిండారీలు ఠగ్గులు మొదలైన మహా దొంగలు, నేరస్థులూ, వాళ్ళ ముఠాలూ.సరైన నిర్వహణ లోపించి గ్రామాలూ పట్టణాలూ అసహ్యమైన మురికీ గబ్బూ ఓడుతూ ఉండేవి.ఒక్క పట్టణం కూడా నచ్చక ఇంగ్లీషువాళ్ళు సొంతంగా కాలనీలు కట్టుకున్నారు.అవే ఈనాటి మెట్రోలు.స్థానిక రాజులూ నవాబులూ జమీందార్లు ఇప్పటి మన శాసనసభ్యుల్లా ఎంపీల్లాగా విలాసభోగాల్లో మునిగితేలుతూ సొంత ఆస్తుల పెంపులోను పరిరక్షణలోను మునిగి ఆ రకమైన కక్కుర్తిలో విదేశీయులకు సైతం నోరుమూసుకుని సలామ్ కొట్టడానికి సిద్ధంగా ఉండేవారు.సలామ్ కొట్టారు కూడా.

అప్పటికి ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం లేదు.ఇంగ్లండు ప్రాథమికంగా మనకంటే ఏ విధంగాను మెరుగ్గా ఉండేది కాదు.పైపెచ్చు మనమే నాగరికతా విషయాల్లో ముందున్నాం కూడా ! మన రాజుల దగ్గర కూడా పెద్ద పెద్ద సైన్యాలూ వాటి చేతుల్లో లక్షలాది తుపాకులూ ఉండేవి.పైగా బెంగాల్, హైదరాబాద్, మైసూరు, శ్రీరంగపట్నం, తిరువాన్‌కూరు, గ్వాలియర్, బరోడా, జునాగఢ్ మొదలైన మన రాజుల కింద ఉన్న రాజ్యాలు అప్పటి యూరోపియన్ దేశాల కంటే విస్తీర్ణంలోను ఆదాయంలోను జనాభాలోను బాగా పెద్దవి కూడా.ఇండియాకు ఆర్థికంగా ఏ విధమైన లోటూ లేదు.ఆ కాలపు దృష్టితో చూస్తే విదేశీయుల చేతుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి సంభావ్యతా లేని మహోన్నతమైన దేశం.కాని వెళ్ళింది.వెళ్ళడమే కాదు, సుమారు 200సంవత్సరాల పాటు వాళ్ళ చెప్పులు మోసి బతికింది.ఈ ఘోర చారిత్రిక విషాదం ఎందుకు జరిగింది ? ఒకసారి యుద్ధంలో ఓడిపోయిన మనం క్రమంగా అన్నింటిలోను ఓడిపోతూ ఈరోజు మనల్ని మనమే అసహ్యించుకునే స్థితికి, మన ఇళ్ళల్లో మన మాతృభాషని మనమే నిషేధించే ఆత్మనిందాపూర్వకమైన దుర్గతికీ ఎలా దిగజారిపోయాం ?

ఈ ప్రశ్నలకు సమాధానం ఈ పేలుళ్ళలో ఉంది.మైనారిటీల్ని బుజ్జగించి వారిని వోట్‌బ్యాంకులుగా మార్చుకోవాలనే దుర్బుద్ధితో ఉగ్రవాదుల్ని ఉపేక్షించడంలో ఉంది."ఎవరు ఎలా చచ్చినా ఫర్వాలేదు.మేమూ మా పార్టీవాళ్ళూ అధికారాన్ని ఆస్తుల్నీ నిలబెట్టుకుంటే చా"లనే బాధ్యతారహితమైన వైఖరిలో గతానికి సమాధానాలు లభిస్తున్నాయి.ఏ నేరానికీ శిక్ష పడని, ఏ వ్యాజ్యాన్నీ ఒకపట్టాన తేల్చని మన న్యాయవ్యవస్థ పెంచిపోషించిన పాముల పుట్టల్లో సమాధానాలు లభిస్తున్నాయి.దేశభక్తీ మాతృభాషాభిమానమూ లేని ఆధునిక యువతలో గతకాలపు పొడుపు కథలకు జవాబులు కనపడుతున్నాయి.

మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే.ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య ఉన్నది కూడా అలాంటి సంబంధమే.బ్రిటిష్-పూర్వరాజులు ఈ అంశాన్ని విస్మరించారు.పూర్వకాలపు రాజనీతిశాస్త్రాల ప్రామాణ్యాల్ని మూర్ఖంగా మదంతో త్రోసిపుచ్చారు.ప్రజల గోడు వినడమే మానేశారు.తమ పదవి దైవదత్తమనుకున్నారు.భోగవిలాసాల్లో మునిగారు.పన్నులు కట్టే ప్రజలకు సేవచేసే కర్తవ్యాన్ని పక్కన పెట్టారు.విదేశీయులకు ఇష్టమొచ్చినట్లు ఎస్టేట్లు కట్టబెట్టారు.

ఈ రోజున మన పరిస్థితి మాత్రం ఏమిటి ? మనం పన్నులు కట్టడానికి వోట్లెయ్యడానికీ తప్ప ఇక దేనికీ పనికిరాము.మన నాయకులకు మన గోడుపట్టదు.వాళ్ళు సంపాదించుకోవడానికే వచ్చారు అధికారంలోకి.మన పేరిట ఉన్న ఆస్తులకు భద్రత లేదు.రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకునే ప్రభుత్వం వాటి పరిరక్షణకు బాధ్యత వహించదు.మన ప్రాణాలకూ భద్రత లేదు.మన పని ప్రభుత్వానికి ఇస్తూ పోవడమే.ప్రభుత్వం మాత్రం మనకేమీ ఇవ్వదు.ఇవ్వాల్సిన అవసరం లేదు.కాని అదే ప్రభుత్వం SEZ ల పేరుతో లక్షలాది ఎకరాలు విదేశీయులకు కట్టబెడుతోంది.ఇదొక దొంగల రాజ్యం. ఈ మైనారిటీ వోట్‌బ్యాంకు రాజకీయాన్ని, ఈ దుష్పరిపాలననీ ఇంకా ఇంకా ఉపేక్షిస్తే ఒక జాతిగా ఒక రిపబ్లిక్‌గా భారతదేశపు అంతాన్ని కళ్ళజూస్తుంది.అది మన జీవితకాలంలోనే జరిగిపోయే ప్రమాదముంది.తప్పదు.ఇది తప్పదు.అందరికీ 1750 నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

Thursday, August 16, 2007

ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?


రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం...
రాజీవ్ గృహకల్ప...
రాజీవ్ ఆరోగ్యశ్రీ...
రాజీవ్ రహదారి... రాజీవ్ యువశక్తి...రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్...కడపలో ఇంకేదో రాజీవ్ సంస్థ...
హైదరాబాదు కె.పి.హెచ్.బి.కాలనీకి రాజీవ్ గాంధి కాలనీగా పేరుమార్పు...
విశాకా స్టేడియమ్ కి రాజీవ్ స్టేడియంగా పేరుమార్పు...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహప్రతిష్ఠాపనలు...
రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్......
ఒకటే శారిడాన్...ఇక ఉండదు తలనొప్పి...

ఎవరీ రాజీవ్ ? మనమంతా ఇంతగా ఆయన్ని తల్చుకు తీఱాలని మన రాష్ట్రప్రభుత్వం మనల్ని శాసించడానికి-ఏం చేశాడాయన ఆంధ్రప్రదేశ్‌కి ? ఇంతగా ఎనిమిదిన్నర కోట్ల మందిమి ఆయనకి తరతరాలుగా ఋణపడిపోవడానికి ఏమిటాయనగారి వితరణ (contribution) ? ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం చూపించాడు ? మన రాష్ట్రంలో ఏ ప్రత్యేకరంగాన్ని ఆయన అభివృద్ధి చేశాడు ? ఆయనగారి స్వరాష్ట్రంలో సైతం ఆయనకు పట్టని బ్రహ్మరథాలు ఇక్కడెందుకు పట్టుతున్నారు చెప్మా ? అదే సమయంలో ఇక్కడి మహానాయకులెందుకు చరిత్ర చెత్తబుట్టలోకి విసిరెయ్యబడుతున్నారు ? అసలు ఏమౌతాడాయన తెలుగువాళ్ళకు ? పొఱపాటున మనమాయన్ని మర్చిపోతే కొంపలేం మునుగుతాయి ? మనమాయన్ని మర్చిపోకూడదని ఈ ప్రభుత్వానికెందుకింత పట్టుదల ?

ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు.కారణం తెలీదు.తెలుగువారిలో రాజకీయాలకు అతీతులైన కవులు లేరా ? కళాకారులు లేరా ? సంఘసేవకులూ, సంఘసంస్కర్తలూ, త్యాగధనులూ, శాస్త్రవేత్తలూ లేరా ? అందరమూ ఇలా బతికున్న అమ్మగారి, చచ్చిపోయిన అమ్మమొగుడుగారి మఱియు అత్తగారి సేవలో తరించిపోవడానికి హేతువేమిటి ? ప్రతినెలా ఢిల్లీకి తెలుగువాళ్ళ డబ్బుతో సూట్‌కేసులు మోస్తే మోశారు, కనీసం సాంస్కృతిక స్థాయిలో నైనా తెలుగుదనాన్ని గుబాళించనివ్వరా ? దేవుడా ! రక్షించు నా రాష్ట్రాన్ని !

Saturday, August 11, 2007

......శాంతి, శాంతి !
ఇప్పుడు భారతదేశంలో అన్ని సమస్యలకూ రామబాణంలాంటి పరిష్కారం ఒకటుంది.అదేమిటంటే మతాంతరిల్లడం.ముఖ్యంగా మనకెవరిమీదైనా కసి ఉన్నప్పుడు బాహాటంగా తిట్టాలనిపించినప్పుడు తెగబడి కొట్టాలనిపించినప్పుడు ఓ కత్తి తీసుకుని ఎవరినైనా కస కస పొడవాలనిపించినప్పుడు ముందుజాగ్రత్తగా మతాంతరిల్లాలి.తరువాత అనునిత్యం మన బాహుమూలాల్ని శుభ్రం చేసుకోవాలి.లేకపోతే రాజకీయపక్షాలకు-ముఖ్యంగా పాలక పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది.ఒకసారి మైనారిటీ హోదా వరించిందో మన దౌష్ట్యానికి లైసెన్సు లభించినట్లే ! అది మన క్రూరత్వానికి పాస్‌పోర్టు మన నీచత్వాలకి వీసా. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు.ఏమైనా మాట్లాడొచ్చు.చట్టాలు మనకు వర్తించవు.రాజ్యాంగం మనముందు బలాదూర్.ప్రభుత్వానికి మనల్ని చూస్తే పంట్లాములోనే అల్పాచమానం.మన పేరెత్తితే రాజకీయపక్షాలకు సన్నిపాతజ్వరం.మనవల్ల బాధపడ్డవాళ్ళకు నాలుగు ఓదార్పుమాటలు చెప్పడానిక్కూడా ఎవడూ ముందుకురాడు.అదీ మన సత్తా ! ముఖ్యంగా క్రీ.శ.2004 నుంచి మనల్ని ఈ మహర్దశ వరించింది.ప్రజాస్వామ్యమంటే ఇంత ఖుషీగా ఉంటుందని మనకు ఇంతకుముందు తెలియక బాబర్ రోజులూ నిజాం రోజులూ రావాలని కలలు కనేవాళ్ళం.ఇప్పుడు మనమే బాబర్లం.మనమే నిజాములం.వహ్వా ! వహ్వా !

ఇది మా జమానా బే !

Wednesday, July 11, 2007

మంచి మనసులకు మంచి రోజులు


"నా మంచి పనులే నన్ను గెలిపిస్తాయి."
నాయుడుగారు తన ఇటీవలి అమెరికా పర్యటనలో ఒక సందర్భంలో అన్న మాటలివి.చెడ్డ పనులు చెయ్యకపోయినా, అధికారంలోనుంచి దిగిపోయాక ఒక రాజకీయ నాయకుడు చెయ్యగలిగిన మంచిపనులేమీ ఉండవు.కనుక ఆయన ప్రస్తావిస్తున్నది"తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించే"అని తెలుస్తోంది.ఇకముందు గెలిపించగల సత్తా ఉన్న ఆ మంచి పనులు 2004 సాధారణ ఎన్నికల్లో మటుకు ఆయన పార్టీని ఎందుకు గెలిపించలేకపోయాయి ? దీనికొకటే కారణం.అప్పుడు రాష్ట్రాన్ని మూడేళ్ళ పాటు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు అతలాకుతలం చెయ్యడం. నాయుడుగారి గురించి మంచిగా మాట్లాడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేకపోవడం.ఇప్పుడు వానలు బాగానే కురుస్తున్నా శేఖర్ దాదా మూడేళ్ళ పాలన మిగిల్చిన మధురస్మృతులేవీ లేకపోవడం.అందుచేత ప్రజలు నాయుడుగారి పరిపాలనని పదేపదే గుర్తుతెచ్చుకోవడం.వాళ్ళు అలా గుర్తుతెచ్చుకుంటున్నారని ఆయనకు తెలియడం.నాయుడుగారి గురించి భావి చరిత్రకారులు ఏం రాస్తారో నాకు తెలీదు.కాని ఆయన సదుద్దేశాలు అపార్థానికి గురైనట్లు ఇంకే నాయకుడివీ గురికాలేదు.తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రదేశపు అధికార పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.దాన్ని ఆయనకున్న అధికార దాహంగా వర్ణించడానికి సాహసించినవాళ్ళున్నారు.పార్టీలో చీలికలు రాకుండా చూడ్డానికి ఆయన కొంతమందిని దూరంగా ఉంచాల్సి వచ్చింది.దాన్ని ఆయన నిరంకుశత్వంగా భావించినవాళ్ళున్నారు.చదువుకున్న మధ్యతరగతి యువకులు పెడమార్గాలు తొక్కడానికి నిరుద్యోగమే కారణమనీ, ఉద్యోగావకాశాలు పెంచాలంటే కంప్యూటర్ రంగం అందించే అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనీ సంకల్పించిన గొప్ప దార్శనికుడాయన.రాజీవ్ గాంధిగారి కంప్యూటర్ యుగం గావుకేకలు కేవలం కేకలకే పరిమితం కాగా నాయుడుగారు ఆచరణాత్మకంగా చేసి చూపించారు.చదువుకున్న యువకుల గురించి తాను పడిన తపనలో పేదవర్గాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న నిష్కారణమైన, అన్యాయమైన నిందల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.ఆ అపనిందలకి ఆయన్ని అధికారపీఠం మీంచి లాగి కిందపడేసేంత శక్తి ఉందని అప్పట్లో ఆయన అభిమానులెవరూ ఊహించలేకపోయారు.కాని అబద్ధానికి నోరు పెద్దదని అనంతర చరిత్ర నిరూపించింది.
నాయుడుగారు తన హయాంలో తెలుగు యువలోకంలో రగిలించిన కంప్యూటర్ యుగ స్ఫూర్తి, దాని ప్రభావం, విస్తృతి ఎంతటివో సరిగ్గా అంచనా వెయ్యడం కష్టం.యువతను ఇంతగా ప్రభావితం చేసిన ముఖ్యమంత్రి అంతకుముందెప్పుడూ లేడు.ఆయన హయాం తొలినాళ్ళలో నేను కిరాయికున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారినప్పుడు నా కంప్యూటర్‌ని మోసిన కూలీ దాని configuration వివరాలడుగుతూంటే నేనాశ్చర్యపోయాను.అతనిది శ్రీకాకుళమట.నాయుడుగా రొకసారి శ్రీకాకుళం వచ్చినప్పుడు అందరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, దేశ భవిష్యత్తు దానిమీదనే ఆధారపడి ఉందనీ ఉపన్యాసమిచ్చారట.అది విని 9 వ తరగతి మాత్రమే చదివిన ఆ కూలీ కష్టపడి MS-Office నేర్చుకున్నాడట.నాయుడుగారు తక్కువ మాట్లాడేవారు.ఎక్కువ పనిచేసేవారు.తన పార్టీవాళ్ళైనా సరే, రాజకీయ నాయకుల్ని కాక చదువుకున్న అధికారుల్నే నమ్మేవారు.విద్యార్థులు పూర్తిగా తమ వ్యాసంగానికే (career) అంకితం కావాలనే సదుద్దేశంతో ఆయన పార్టీకున్న విద్యార్థి విభాగాల్ని రద్దుచేసి కళాశాలల్లో రాజకీయాల్ని నిషేధించడంతో తానే చివరికి నవయువత మీద పట్టు కోల్పోయారు.కొత్తగా వోట్లు వచ్చిన 18 ఏళ్ళ యువతకు అప్పట్లో నాయుడుగారి విషయం తెలీదు.వాళ్ళ దృష్టిలో నాయుడుగారు తమ చిన్నప్పటినుంచి అధికారంలో ఉన్న వ్యక్తి.అందుచేత ఈసారి వైవిధ్యంగా వేరే పార్టీకి వోటేద్దామనుకున్నారు.చేసిన కృషి గురించి చెప్పుకోలేకపోవడం ఆయన జీవితంలో ఘోరపరాభవానికి దారితీసింది.అప్పట్లో నాయుడుగారి ఉద్దేశాల గురించి ప్రత్యర్థులు అనవసరమైన చాకిరేవుపెట్టి జనంలో అనుమాన బీజాలు రేకెత్తించడంలో సఫలీకృతులయ్యారు.నాయుడు మళ్ళీ అధికారంలోకొస్తే అంతటా ప్రైవేటు మెడికల్ కాలేజీలే నని గగ్గోలు పెట్టి మెడికోల్ని రెచ్చగొట్టారు.ఇప్పుడు ఉన్న మెడికల్ సీట్లు కూడా రద్దైపోవడానికి మాత్రం కారణం తామే.ఈసారి నాయుడొస్తే రిటైర్‌మెంట్ బెనిఫిట్సు ఉండవని ఊదరగొట్టారు.కాని చివరికి అవి లేకుండా చేసింది మాత్రం తామే.నాయుడొస్తే ఆర్టీసీ ప్రైవేటైపోతుందని ఆర్టీసీవాళ్ళని రెచ్చగొట్టారు.ఇప్పుడు డిపోలు మూసేస్తున్నది మాత్రం తామే.నాయుడొస్తే ఎస్సీలకూ బీసీలకూ ఉపకార వేతనాలు ఉండవన్నారు.ఎగ్గొట్టింది మాత్రం తామే.ఇప్పుడు వందలాది బళ్ళూ కాలేజీలూ మూసేసే పనిలో ఉన్నారు.పైగా ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులివ్వకుండా మూడేళ్ళ నుంచి పేద దళితుల పొట్టలు ఎండగొట్టారు.ఏదైతేనేం - ఆ భస్మాసుర హస్తాల దెబ్బకు ముందు నాయుడుగారు, తరువాత ప్రజలూ బలయ్యారు.

ప్రజలు ఇప్పుడిప్పుడే మేలుకుని నాయుడుగారి పరిపాలన మంచిచెడ్డల గురించి పునరాలోచిస్తున్నారు.నాయుడుగారి దశ కూడా ఒక ఏడాది తరువాత మెరుగుదల చూపిస్తుంది.ఆయనకీ దురదృష్టయోగం 2002 పూర్వార్థంలో మొదలైంది.ఇది ఆయన స్థాయి మనిషికి ఎంత అపకారం చెయ్యాలో అంతా చేసింది.అపకీర్తి, నీలాపనిందలు,హత్యాప్రయత్నం, పదవీభ్రష్టత, ఇరవై ముప్ఫై వ్యాజ్యాలు, బలమైన అనుచరులకు భంగపాట్లు, వారిలో ఇద్దరికి కారావాసం, ఒక మాజీ మంత్రితో సహా 130 మంది స్థానిక తెలుగుదేశం నాయకులు హత్యలకు గురికావడం, సహచరుల ఇళ్ళపై ఆదాయంపన్ను శాఖ దాడులు - ఇటువంటి దురదృష్టాల జాబితా చాలా పెద్దది.

సాధారణంగా ఏడున్నర సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితి ముగిసి చంద్రుడికి గ్రహణం విడుస్తుంది.అయితే అంతకు ఒక సంవత్సరం ముందు నుంచే పరిస్థితి అనుకూలంగా మారిపోవడం మనం గమనిస్తాం.కీలకమైన సంవత్సరాలలో నాయుడుగారి సారథ్యం ఆంధ్రదేశానికి చాలా అవసరం.ఆయనకొక చారిత్రిక పాత్రని భగవంతుడు సిద్ధపరచి ఉంచాడు.నాయుడుగారికి ఆయన వంశానికీ పుత్రపౌత్రాభివృద్ధిగా సకలాయురారోగ్య ఐశ్వర్యములు కలుగు గాక.

Tuesday, June 19, 2007

మానవ జాతికి ప్రాణదానం చేసిన మన తెలుగువాడికి స్మారక నివాళి
ప్రపంచ ప్రఖ్యాత తెలుగు శాస్త్రవేత్త స్వర్గీయ యెల్లాప్రగడ సుబ్బారావుగారి పేరు తెలియనివారు లేరు. ఇటీవలి వరకు మానవాళిని పట్టి పీడిస్తూ పీడకలలుగా మారిన ఎన్నో మహమ్మారులకి మందులు కనుగొని చరిత్రలో నిలిచిపోయాడు ఆ మహనీయుడు.ఆయన కనుగొన్న టెట్రాసైక్లిన్ దెబ్బకి ప్లేగువ్యాధి భూమండలం మీదనే లేకుండా అంతరించిపోయింది. బోదకాలు గడగడా వణికిపోయింది. అవి కాక ఇంకా ఈరోజు మనం వాడుతున్న ఇంకెన్నో యాంటిబయోటిక్ మందులు సుబ్బారావుగారి భిక్షే. ఆ విధంగా ఆయన గర్భవతులు మొదలుకొని ప్రమాదాలకి గురైనవాళ్ళ వరకు కోట్లాదిమంది జీవితాలకు ఆయుష్షు ప్రసాదించాడు. ఆ మహా మహితాత్ముడికి ఇప్పుడు మన ఆంధ్ర రాజధానిలో ఒక స్మారక చిహ్నం వెలియబోతోంది. ఈ శుభవార్త గురించి "ఈనాడు" మాటల్లో చదవండి.

Saturday, March 17, 2007

మీడియా : ఒక మాఫియా ?-6

వ్యవస్థాగత లోపాలకి MNR బాధ్యుడా ? : మన రాష్ట్రంలోని వైద్య కళాశాలలు అనేక సమస్యలతో సతమతమౌతున్నాయి.MNRవైద్య కళాశాల ఇందుకు మినహాయింపు కాదు.అయితే ఈ సమస్యల్లో ఎన్ని స్వయంకృతాలు ? ఎన్ని వ్యవస్థాగతంగా ప్రభుత్వం వైపునుంచి సృష్టించబడ్డాయి ?ఈ విషయాలు తెలుసుకోకుండా "ప్రైవేట్ కళాశాలలు"అని నీచంగా మాట్లాడ్డం భావ్యం కాదు.క్షంతవ్యం అంతకంటే కాదు.MNRవైద్య కళాశాల స్థాపించబోయే ముందు MNR Educational Trust ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు కొన్నింటిని నేనే స్వయంగా సిద్ధం చేశాను.నాకీ విషయంలో కొంత అవగాహన ఉంది.

MNR వైద్య కళాశాలనే ఉదాహరణగా తీసుకుని ఈ సమస్యని విశ్లేషిద్దాం.MNR వైద్య కళాశాల ఆ రోజుల్లో రూ.20 కోట్ల వ్యయంతో స్థాపించబడింది.ఇందులో చాలా భాగం అప్పే.కొంత భాగాన్ని మాత్రం బయటి భాగస్వామ్య సంస్థలు భరించాయి.ఆ కళాశాల పెట్టినందుకు MNRసంస్థ ఎన్ని సంవత్సరాల పాటు నష్టాలు ఎదుర్కున్నదో నాకు తెలుసు.Trustకి చెందిన ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి వేళకి జీతాలివ్వడం కూడా కొన్నిసార్లు కష్టమైంది.ఆ కారణం చేత ఆ రోజుల్లో ఆలస్యంగా జీతాలిచ్చేవారు (నాకు కూడా). Trustకి వైద్యరంగంలో పూర్వానుభవం లేకపోవడాన వైద్య కళాశాల నిర్మించడానికి నియమించిన ఆఫీసర్లు అనేక మంది Trustని మోసగించి డబ్బు కాజేసి మరిన్ని నష్టాలకి కారకులయ్యారు.అలా కోల్పోయిన డబ్బులో కొంతమాత్రమే Trust వెనక్కి రాబట్టగలిగింది.చాలా సందర్భాల్లో అవినీతిపరులైన ఆఫీసర్లని వెళ్ళగొట్టడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది.

MNR వైద్యకళాశాలల కాంప్లెక్స్ నిర్మించిన సంగారెడ్డి-ఫసల్‌వాడి కేంపస్ ఉన్నది నిజానికి ఎప్పటి నుంచో MNR కుటుంబానికి చెందిన 77ఎకరాల వ్యవసాయ భూమిలో. అది వైద్య కళాశాల నిమిత్తం కొన్నది కాదు.ఒకవేళ అలాంటి స్థలం MNR దగ్గర సిద్ధంగా లేకపోయి ఉంటే, ప్రత్యేకంగా కొనాల్సి వస్తే ఎంతవుతుందో ఆలోచించండి.

ఇన్ని అష్టకష్టాలు పడి వైద్య కళాశాల నిర్మిస్తే పూర్వకాలంలో లాగా ప్రభుత్వం శాశ్వత గుర్తింపు గాని అనుబద్ధతని(affiliation)గాని ఇవ్వట్లేదు.ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాటిని నిత్యనూతనంగా పునరుద్ధరించుకోవాల్సిందే.నిజానికి ఇది ప్రభుత్వంలోనే చాలా అవినీతికి దారితీస్తోంది.ఆ విధంగా ప్రైవేట్ కళాశాలలవారు(ప్రభుత్వ)పీడిత వర్గమే గాని(ప్రజా)పీడకులు కారు.అదే ప్రభుత్వం తన వైద్య కళాశాలల్ని ముద్దుగా చూసుకుంటోంది.అక్కడ సౌకర్యాల మాట అలా ఉంచి భవనాలే డోక&#