tag:blogger.com,1999:blog-34110760.post-1410265979761824712008-02-26T22:34:00.000+05:302008-02-26T22:34:00.000+05:30సూటిగా అడగాల్సిన ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసారు...సూటిగా అడగాల్సిన ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసారు. తార్కికంగా చూస్తే ఆయనామాట అని ఉండడనిపిస్తోంది. అంబేద్కరును పొగట్టం ఇవ్వాళ పొలిటికల్లీ కరెక్టు. అందునా ఓ రాజకీయుడు అంబేద్కరును విమర్శించడం కల్లోని మాట! ఆత్మహత్యతో సమానమది! ఉండవల్లి అలా అన్నాడని అనుకోలేం. <I>దురదృష్టం</I> కొద్దీ ఆ మాట అన్నట్టున్నాడు.<BR/><BR/>ఆయన నిజంగానే, కావాలనే ఆ మాట అన్నాడనుకుందాం.. అనకూడదా ఏంటి? విమర్శించనే కూడదా? తన అభిప్రాయం తనది, అది చెప్పుకునే హక్కు కూడా లేదా? ఈ విమర్శలూ, దిష్టిబొమ్మలు తగలెయ్యడం, ఆయనేదో హత్య చేసేసినట్టు గగ్గోలు పెట్టెయ్యడం.. ఇదంతా అనవసరమైన రాద్ధాంతం, రాజకీయం చెయ్యడం తప్ప మరోటి కాదు. ఏ అవకాశం దొరుకుద్దా.. హడావుడి చేసి, పేపర్ల కెక్కేద్దామా అనే యావే ప్రతీవాడికీ! ఇహ ఈ పాలాభిషేకాల ప్రహసనమొకటి.. ప్రతీ దానికీ పాలాభిషేకాలు చేసెయ్యడం రివాజైపోయింది. <BR/><BR/>తమను తాము మార్కెటింగు చేసుకునే రాజకీయుల తాపత్రయమిది.చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com