6.3.10
ఇహపై ఆంగ్లంలో కూడా....
9:00 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: సమా (info)
ప్రియమిత్రులారా ! ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కలగూరగంప బ్లాగులోని వ్యాసాలు "కొంతకాలం" పాటు ఆంగ్లభాషలో కూడా వెలువడతాయని గమనిక. ఈ బ్లాగు-అభిమానులకు కలగనున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఎప్పటివలెనె సహకరించవలసినదిగా అందఱినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను.
ఈ సందర్భంగా మఱొక నూతన ఉగాది పర్వదిన తీర్మానం - గత ఏడాది నుంచి నేను నా వృత్తివ్యాపారాలలో ఊపిరి సలపనంతగా తలమునకలు కావడం చేత ఇహమీదట నేను నా బ్లాగుకే పరిమితం కావడం తప్పనిసరవుతోంది. ఈ రెండింటినీ నేను సమన్వయించుకోలేకపోతున్నాను. కనుక భవిష్యత్తులో ఇతరుల బ్లాగులూ, సైట్లూ చదవలేను. వ్యాఖ్యలు వ్రాయలేను. నా బ్లాగులో ఇతరులు వ్రాసే వ్యాఖ్యలకి సమాధానాలు కూడా వ్రాయలేను. పాఠకులు ఈ బ్లాగు URL టైప్ చేసి ఎప్పుడైనా ప్రాపించవచ్చు, తాజా టపాలు చూసుకోవచ్చు.
