20.1.10

జీవితాలకే బంద్ !



మిత్రమా ! నా తెలంగాణా మిత్రమా !
రాజకీయ రాబందులు రేపిన చిచ్చు ఇది
నాయకపురుగులు తొలిచిన పుచ్చు ఇది
ఈ చిచ్చులో నువ్వు శలభం కాకు
ఆ కుళ్ళులో పడి నువ్వు పుచ్చిపోకు
అనవసరంగా అలా చచ్చిపోకు
నీ అమూల్య జీవితం వృథా చేసుకోకు
రెండొందల తొంభైమూడుమందిలో
రెండొందలేళ్ళకైనా పదవి సంశయం
నూటపందొమ్మిదిమందిలో పదవులు
నూటికి నూఱుశాతం నిశ్చయం
ఇదే ఈ వేర్పాటువాదం అసలురూపం
ఇది బహిరంగ పదవీకాంక్షాప్రకోపం
ఈనాటి వీరి రాజీనామాలు
ప్రజలకి పెడుతున్న పంగనామాలు
తెలంగాణపై శాశ్వతాధికారం కోసం
బలంగా చేస్తున్న తుదిప్రయత్నం
నయా నిజాములు వీరు - తియ్యని
గులాబ్‍జాములు కారు
ప్రత్యేక తెలంగాణ అంటే ఇతిహాసం
పగలబడి చేస్తుంది అట్టహాసం
ఉందా చరిత్రలో విడిగా కోస్తా ?
ఉందా విడిగా రాయలసీమ కాస్త ?
లేవు ఇవెప్పుడూ లేవు మిత్రమా
ఇహముందూ ఉండవు సుమా !
ఉన్నదొకటే మన దేశం, ఈ ఆంధ్రప్రదేశం
కాదిది నీకు విదేశం,
ఇది కమ్మని తెలుగుదేశం
దేశమంత రాష్ట్రమిది పర
దేశులకూ అసూయ ఇది
చీలిపోయి చిన్నబోకు
సోదరులను చిన్నబుచ్చకు
సమస్యలుంటే పరిష్కరించుకుందాం
గొడవలుంటే మాట్లాడుకుందాం
తెలియనివి తెలుసుకుందాం
దేశసంస్కృతి పంచుకుందాం
వీడుదాం పరాయితనం అరాచకం
ఆడుదాం పరిచయం పరాచికం".

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్