గనన్న మన అధినాయక జయహేకాంగ్రెసు చీలికనేతా
కర్నూలు, కడప, చిత్తూరనంత
శ్రీకాకుళం దాకా
శేషాచల నల్లమలల్లో
లంచాల వఱదలు పొంగ
తన ఘనకబ్జా సాగె
తన వ్యాపారమె రేగె
చాల్లే తమ ఘనత సొద
జగనన్న ఝగడాకారక జయహే
కాంగ్రెసు చీలికనేతా
జయహే జయహే జయహే
జయజయజయ జయహే
ప్రతిజ్ఞ
ఎస్. రాజశేఖరరెడ్డి మా జన్మజన్మల రాజు. జగన్ మా యువరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వారి కుటుంబ ఎస్టేటై యున్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వారి తాతముల్లెయై యున్నది. నేను వారి ఎస్టేటును, వారి తాతముల్లెను వారి కొఱకు కాపలా కాసెదను. సుసంపన్నమైన, బహువిధమైన, నడమంత్రపు సిరియైన మా వైఎస్. కుటుంబ ఆస్తులు మాకు మిక్కిలి గర్వకారణమై యున్నవి. వారి కుటుంబము చేత మఱింత దోచుకొనబడుటకు నేను సర్వదా కృషి చేయుదును. వారి వారసుడైన జగన్ గారి తొత్తులను, తాబేదార్లను, చెంచాలను, రౌడీలను, గూండాలను నేను భయభక్తులతో గౌరవించెదను. వారికి సాష్టాంగపడెదను. వారి పేరు చెప్పి మమ్ములను బెదిఱించువారందఱి తోడను మర్యాదగా నడచుకొందును.వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.
