Sunday, May 11, 2008

మహిళా రిజర్వేషన్ - మరో కోణం - 2


పూర్వం అందరికీ కలిపి ఒకటే ఇండియా ఉండేది. ఇప్పుడు రెండు ఇండియాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాయి. ఒక ఆడ ఇండియా. ఒక మగ ఇండియా. మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలూ, ప్రత్యేక కమిషన్లు, ప్రత్యేక న్యాయస్థానాలు, మగవాడికి మాత్రమే వర్తించేవీ, ఆడదానికి వర్తించనివీ అయిన ప్రత్యేకమైన అమానుష చట్టాలు - అన్నీ ప్రత్యేకమే. ఇప్పుడేమో ప్రత్యేక నియోజకవర్గాలట. సమానత్వాన్ని అంగీకరించినచోట ప్రత్యేకాలెందుకో ఎవరూ చెప్పరు.

ఇవన్నీ ప్రత్యేకంగా తమక్కావాలని వాళ్ళెప్పుడైనా అడిగారా ? ఉన్న వ్యవస్థల్లోను, చట్టాల్లోను మహిళలకూ, వాళ్ళ సమస్యల పరిష్కారానికీ స్థానం లేదా ? లేక అంతకు ముందున్న వ్యవస్థలు ఉద్ధరించలేనిదేదో కొత్త వ్యవస్థలు ఉద్ధరించి చూపుతాయనా ? మఱి ప్రత్యేక వ్యవస్థల్ని ఎందుకు ఏర్పఱుస్తున్నారు ? వీటన్నింటి వెనుకా ఎవరున్నారు ?

మహిళల విషయాలు ఒక సమగ్రచిత్రంలో ఏకదేశమే తప్ప అవి తాముగా ఒక సమగ్రచిత్రాన్ని ఏర్పఱచజాలవు. సమకాలీనంగా మహిళలకు చట్టసభల్లో గల అఱకొఱ ప్రాతినిధ్యాన్ని సైతం ఈ కోణంలోంచి అవగాహన చేసుకోవాల్సి ఉంది. దేశంలో చట్టసభలకు ఎన్నిక కావడం అందని మ్రానిపండైన వర్గాలు చాలానే ఉన్నాయి. అసలు సమస్య - మన ఎన్నికల ప్రక్రియ బహుఖరీదైనది కావడం. అందువల్ల మన దేశంలో కోట్లాదిమంది మగవాళ్ళు కూడా తమ గ్రామపంచాయితీలో వార్డుమెంబరుగా నైనా పోటీచెయ్యజాలని దీనావస్థలో ఉన్నారు. మహిళల పరిస్థితైనా ఇందుకు భిన్నంగా ఉండదు. ఈ విధంగా గత 60 ఏళ్ళుగా రాజకీయ అస్పృశ్యులైన ఈ పేదవర్గాల్ని ప్రజాస్వామ్య ప్రధానవాహినిలోకి తేవడానికి కారుచౌకయిన మార్గాలేమైనా ఉన్నాయా ? అని ఆలోచించిన పాపాన పోలేదీ భారతప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ వాళ్ళ వోట్లు కొని గద్దెనెక్కడంలో తరణోపాయాన్ని చూసుకుంది తప్ప. అలాగే కవులూ, కళాకారులూ, పాత్రికేయులూ, పండితులూ, మతగురువులూ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఇంజనీర్లు, వైద్యులూ, పదవీవిరమణ చేసిన సైనికులూ, క్రీడాకారులూ, సంఘసేవకులూ - ఇలా తమ జన్మలో ఎన్నడూ కనీసం ఒక గ్రామపంచాయితీ భవనాన్ని గాని మునిసిపల్ కౌన్సిల్ ని గాని చూసి యెఱగని మగవాళ్ళు మిలియన్లాదిగా ఉన్నారు. వీళ్ళందరి ప్రధాన సమస్యా ఒక్కటే - ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన ఆర్థిక పుష్టి కొఱవడ్డం.
వాస్తవానికి రాజ్యసభ మొదట్లో ఇలాంటివాళ్ళకోసమే ఉద్దేశించినట్టిది. కాని అది కూడా ఇప్పుడు ఫక్తు వృత్తిరాజకీయ నాయకులతో నిండిపోయింది.

సౌమ్యులూ, హింసచెయ్యడం లేదా హింసని అడ్డుకోవడం చేతకానివాళ్ళూ మన దేశంలో చట్టసభలకు ఎన్నిక కాలేరనుకుంటే పైన పేర్కొన్న తరహా మగవాళ్ళంతా ఆ శ్రేణిలోకే వస్తారు. మహిళలూ ఆ శ్రేణిలోకే వస్తారు. అందుచేత అసలైన పరిష్కారం ఉన్నది ఎన్నికల్లో ధనస్వామ్యానికి అడ్డుకట్ట వేయడం దగ్గర ! అంతేగాని ఒక్కొక్క లింగానికీ, వర్గానికీ ఇంత చొప్పున రిజర్వేషన్లు కల్పించడం దగ్గర కాదు. అలా కల్పిస్తున్నామంటే మనం అసలు సమస్య నుంచి మొహం చాటేస్తున్నట్లే. ఈ విధానం ఫలవంతం అయ్యే ఆస్కారం లేదు. ఫలితార్థంగా ఏం జరుగుతుందంటే - ఈ ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్ని డబ్బున్న ఆడవాళ్ళే గద్దల్లా తన్నుకుపోతారు. వాళ్ళు సాధారణంగా మగనాయకుల భార్యలో, ఉపభార్యలో, కూతుళ్ళో, కోడళ్ళో అయ్యుంటారు. చాలా సందర్భాల్లో ఇద్దరూ పక్కపక్క నియోజకవర్గాల్లోనే నిలబడే అవకాశం ఉంది. అంటే గుంటూరులో భర్త, తెనాలిలో భార్య అన్నట్లు.

కనుక ప్రతిపాదిత రిజర్వేషను నుంచి సమూలమైన మార్పుల్ని (radical changes) ఆశించలేము. చట్టసభల్లో జరీచీరల ధగధగలు మఱికొంత ప్రకాశమానమౌతాయేమో ! లేదా కొందఱు ఫెమినిస్టులకు మాంఛి కిక్కు, థ్రిల్లు కలుగుతుందేమో ! అంతకన్నా పెద్దగా ఏమీ జరగదు. అయితే ఈ బిల్లు పాసైన తరువాత కూడా ఫెమినిస్టుల Devil's work-shop చుఱుగ్గా పనిచేస్తూనే ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మగవాళ్ళ నుంచి ఇంకా ఇంకా ఏమేం కొట్టెయ్యాలా ? అనే నిరంతరచింతతో వాళ్ళు అనుదినం సరికొత్త నిలదీతల (Demands) తో ముందుకొస్తూ నే ఉంటారు.మగవాళ్ళకు బుద్ధిలేకపోతే వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా అన్నీ సాధించుకుంటూ పోతారు.

(సమాప్తం)

17 వ్యాఖ్యలు:

sujata said...
This post has been removed by the author.
sujata said...

౧) నేను ఎంత మాత్రం ఫెమినిస్ట్ ని కాకపోయినా.. కొన్ని మీ వాదనలు / మహిళల పట్ల మీ అభిప్రాయాలూ చాలా sexist గా ఉన్నాయి. ఆయితే ఎవరి జీవితానుభావాలను బట్టీ వాళ్ల వ్యక్తిత్వం మీద బలమైన ముద్రలు పడుతూ ఉంటాయి కాబట్టి.. మీ జీవితం లో ఎపుడో ఒకపుడు స్త్రీ కారణంగా చేదు అనుభూతులు ఎదురైనట్టు అనిపిస్తుంది. మహిళలూ, పురుషులూ.. ఒకరి కొకరు తోడు గా ఉంటేనే సమాజం. స్త్రీలూ మనుషులే కాబట్టి, మానవ సహజమైన తప్పులు వారూ చేస్తారు.(మీ దృష్టి లో చాలా తప్పులు చేస్తారు..) మీకు ఎవరిమీదన్నా.. కోపం ఉంటే.. క్షమించేయ్యండి. క్షమించడం వల్ల మీ మనసు చాల ప్రశాంతం అవుతుంది.

౨) స్త్రీ లను చట్టం రక్షించడానికి ప్రయత్నం చెయ్యబట్టే.. కిరోసిన్ పోసి తగలుపెట్టడం, కట్నం కోసం మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం లాంటి సంఘటనలు బాగా తగ్గాయి. చట్టాన్ని ఆసరా గా తీసుకుని భర్తలను బాధించే మహిళలూ ఉన్నారు. కానీ కోర్టుల్లో వ్యాజ్యాలు ఏక పక్షంగా జరగవు కాబట్టి.. ఎవరూ వెంటనే అన్యాయంగా శిక్ష లకు గురి కారు.

౩) మహిళల కే కాదు, వికలాంగులకు తప్ప ఎవరికీ, ఎందులోనూ రిజర్వేషన్ లు ఇవ్వకూడదు. అందరికీ ఒకే లాంటి అవకాశాలు కల్పించాలి. మహిళల మీద వివక్ష చాల మటుకూ తగ్గుతున్నప్పుడు ఈ రిజర్వేషన్లు అనే భావన అనవసరంగా వారి మీద వ్యతిరేకతను కలిగిస్తుంది. అర్హులు ఎవరైనా..తను మహిళ కానందుకు ఎప్పుడైనా అవకాశాన్ని కోల్పోతే.. అది చాల అన్యాయం.

Kathi Mahesh Kumar said...

ఈ వ్యాసం లో అభిప్రాయాలూ sexist గానే కాక అక్కడక్కడా "inhuman" గా కూడా ఉన్నాయని మనవి. "రిజర్వేషన్" అన్నపదం వినగానే పంచమహాపాతకాలు చుట్టుకున్నాట్టు ప్రవర్తించే కొందరు ‘అతిగాళ్ళ’ చాయలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇంతకుమునుపు మీరి వ్రాసిన వ్యాసం నాకు ఆమోదయోగ్యం కాకున్నా,ఖేదాన్ని మాత్రం కలిగించలేదు. కానీ ఈ వ్యాసం అందుకు మినహాయింపైనది.

మహిళా రిజర్వేషన్ వల్ల దేశం రెండుగా మారిపోతున్నదనడం చాలా సిల్లీగా ఉంది. మన భారతదేశం చాల్లా దేశాలుగా విడిపడి కూడా, ఒక్కటిగా ఉందని గమనించగలరి.అందుకే మనం భిన్నత్వంలో ఏకత్వమని గర్విస్తాం.

ఇక మహిళా రిజర్వేషన్ ని ఇంటి స్థాయిలో అర్థం చేసుకుంటే (పార్లమెంటు కన్నా)చాలా సులభంగా అర్థమవుతుందనుకొంటా. మన ఇళ్ళలో చాలా వరకూ నిర్ణయాలు (ఏ కూర ఎప్పుడు చేయాలిలాటివి తప్ప) నాన్నలు తీసుకుంటారు.ఒకవేళ అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడం లో భాగమయ్యుంటే, ఆ నిర్ణయం లో ఏదైనా ‘మార్పు’ ఉండేదేమో గమనించండి!

ఖచ్చితం గా మార్పు ఉండేదేమో అని నా నమ్మకం. ఎందుకంటే, ఆడవాళ్ళ ఆలోచనా ధోరణి మగవాళ్ళకు భిన్నంగా ఉంటుందిగనక.ఇక రాజకీయాలకి వద్దాం. పంచాయతీ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించినప్పటినుండి, ఈ స్థాయి లో విద్య,వైద్యం మరియు మంచినీటి సమస్యల పట్ల అధిక శ్రద్దని వీరు కనబరిచినట్టు(మగాళ్ళున్నఫ్ఫుడు వీధి దీపాలు,రోడ్ల లేదా కొత్త నిర్మాణాలపై దృష్టి పెట్టెవారు) పరిశోధనలు వెల్లడిస్థున్నాయి.అంటే మౌళికంగా ఎంత మార్పో ఊహించగలరు.చాలా మందో లేక కొందరు మహిళలు పితృస్వామ్య భావజాలానికి ప్రతీకలుగా మారడం జరగొచ్చు కానీ, మహిళలు తమ సహజమైన "అమ్మతనాన్ని" కోల్పోయి ప్రవర్థిస్తారనుకోవడం...చాలా దారుణం.

ఇక్కడ పోరు జనాభాలో సగం మందికి నిర్ణయాధికారం లో భాగం కల్పించడంలో అని గమనించండి. ఆడాళ్ళమీద ఎవరూ దయచూపించక్కరలేదు. ఈ రిజర్వేషన్ కల్పించడం వల్ల మనమీద (భారతదేశం మీద) మనమే దయతలుస్తున్నామని గుర్తించగలరు.

Chaks said...

పదాలు కొద్దిగా ఘాటుగా ఉన్నా భావం మాత్రం బాగుంది. చాలా మంది మగాళ్ళకి మహిళల పట్ల గౌరవభావాన్ని కలిగించింది మన సంస్కృతి వలన గానీ చట్టాన్ని చూసి కాదు. మహిళల్లో లంచగొండులు లేరా? మహిళల్లో నీచులు లేరా? అక్రమసంబంధాల కోసం కన్న బిడ్డలను చంపుతున్న ఆడాళ్ళు లేరా? ఇవన్నీ వదిలేసి ఈ మీడియా ఈ ఫెమినిస్టులు అంతా కలిసి మగాళ్ళు నీచులన్నట్లు ఆడాళ్ళు మాత్రమే అమృతమూర్తులు అన్నట్లు ఎందుకు ఒక హైప్ క్రియేట్ చేస్తారో అర్ధంకాదు. మహిళ ఒప్పు చేస్తే అందరూ పొగడాలి అదే తప్పు చేస్తే "పోనీలే పాపం, మహిళ" అని ఒదిలెయ్యాలి. ఇదీ ప్రస్తుత న్యాయం

@సుజత గారు: నాదృష్టిలో సమస్య కేవలం రిజర్వేషన్లదికాదు. వ్యవస్థ మీద. ఒకప్పుడు ఎవరో బాధించబడ్డారని ఆ కసిని/కోపాన్ని నేటి జనరేషన్ మీద తీర్చుకుంటుంన్న ఈ పనికిమాలిన వ్యవస్థమీద. కోర్టుల్లోనైనా, బైటైనా ఆడదాన్ని ఇప్పటిదాకా రక్షిస్తున్నది కేవలం సానుభూతి. ఈ సానుభూతి ఎంత భయంకరమైనదంటే ప్రభుత్వాలనే కూల్చే శక్తి దీనికుంది. మగవాడి దురదృష్టవశాత్తూ ఇది మహిళలకు పుట్టగానె అంటిపెట్టుకుని వుంటుంది. దాంతో ఎక్కడచూసినా వారి మాటకే/కన్నీళ్ళకే విలువ చివరికి కోర్టుల్లోనైనా.

ఇక రిజర్వేషన్ కావాలనేవాళ్ళు మనదేశంలో మరో వెయ్యేళ్ళ తరువాతకూడా వుంటారు, అప్పుడు కూడా దానికి వారుచెప్పే కారణం "వెయ్యేళ్ళ క్రితం మేమణగదొక్కబడ్డామని" అది మన ఖర్మ అంతే. ఆమధ్య మా ప్రొ-రిజర్వేషన్ మిత్రుడు పిచ్చాపాటి మాట్లాడుతూ "రిజర్వేషన్లు సీట్లివ్వడంలోనే కాదు, పాస్ చేయడంలోకూడా వుండాలి" అన్నాడు, ఖర్మ!. అదికూడా జరుగుద్దేమో! ఈ మధ్య ప్రతిఒక్కరూ బ్లాగుతున్నారని బ్లాగుల్లో కూడా రిజర్వేషన్లు కావాలన్లేదు సంతోషం.
@క్రాంతి గారు దయచేసి వర్తమానంలోకి రండి సార్. ప్రస్తుతం మనదేశం ఎప్పుడైనా పేలడానికి సిద్దంగాఉన్న అగ్నిపర్వతంలా ఉంది. మీరు మెచ్చుకుంటున్న భిన్నత్వంలో ఏకత్వం లాంటి కాలంచెల్లిన భావాలకు ఇప్పుడు స్థానం లేదు. మహిళలు, అమ్మతనం లాంటి మాటలని జనరలైజ్ చేసి మాట్లాడే ముందు గత కొన్నేళ్ళనుండీ పేపర్లలో వస్తున్న కామినీ,ఢాకిణీ లాంటి ఆడోళ్ళ గురించికూడా ఆలోచించండి.
చిన్న అనుమానం "మనం నిర్ణయాధికారంలో భాగం చేస్తున్నామా లేక దేశాన్ని దోచుకోవడంలోనా?"

Kathi Mahesh Kumar said...

@ చక్న్ గారు, మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించక పోయినా అవి గౌరవప్రదంగానే ఉన్నయ్.కానీ నేను చేసిన జనరలైజేషన్ కన్నా మీరు మాట్టాడింది చాలా జనరల్ అని గ్రహింపగలరు. అంతేకాక మీ ఆర్గ్యుమెంట్ లో ఉక్రోషం కోపమే తప్ప, లాజిక్ మరియు రీజన్ తక్కువైంది.అందుకే మీ భావాల్ని గౌరవించగలనే గానీ, ఆలోచనల్ని అంగీకరించలేకున్నా.

మన సమస్యల్లా ఆడాళ్ళు అనగానే మనం నిత్యం కాలేజిలో పోట్లాడిన అమ్మాయిలో, లేక జయలలిత లాంటి రాజకీయనేతలు గుర్తుకు రావడం(లేక మీరుచెప్పిన కామినీ,ఢాకిణీ లాంటి ఆడోళ్ళ గుర్తుకు రావడం). మగాళ్ళూ అనగానే బస్సులో ‘షోల్దరింగ్’ చేసినవాడో, లేక సినిమా విలనో గుర్తుకు రావడం.ఈ మాటలన్నప్పుడు మన తల్లీచెల్లీ, తండ్రీఅన్న గుర్తొచ్చినపుడు మాత్రమే,మన ఆలోచనల్లో కొంత శానిటీ రాగలదని నాకనిపిస్తుంది.

"మనదేశం ఎప్పుడైనా పేలడానికి సిద్దంగాఉన్న అగ్నిపర్వతంలా ఉంది" అన్నారు.దానికి నేను చెప్పేది ఒక్కటే,India may be a country of thousand mutinies, but it is still 'India'.నిత్యం ఒక పోరాటం చేస్తూ కూడా మనకొచ్చిన ప్రమాదమేమీలేదు.సరైన పంధాలో చూస్తే ఈ మార్పులు రాబోయే కాలంలో భారతదేశాన్ని మరింత పటిష్టం చేస్తాయని నమ్ముతాన్నేను.

sujatha said...

ఆత్మాభిమానం లేకుండా అతివాదం చేసే వాళ్ళు పురుషులైనా, స్త్రీలైనా (ఆడది, మగాడు అని వాడలేకపోతున్నాను)వారిని వ్యతిరేకించాల్సిందే! నేను ఫెమినిస్ట్ ని కాదు. అయినా ఫెమినిస్ట్ ల పట్ల రచయిత వాడిన పదాలను అంగీకరించలేకపోతున్నాను. రచయిత ఎటువంటి స్త్రీలను పరిశీలించి రాశారో మనకు తెలియదు. అంత మాత్రాన, అందర్నీ ఒకే గాటన కట్టి సమాజ వినాశనానికి స్త్రీలు కంకణం కట్టుకున్నట్టు చిత్రిస్తుంటే విస్తుపోవాల్సివస్తోంది. పురుషులే మైనారిటీలైనట్టు, వాళ్లేదో స్త్రీల దౌర్జన్యాలకు గురై చచ్చిపోతున్నట్టు రచయిత బాధ పడుతున్నారు.

"ఈ ప్రతిపాదిత 33 శాతాన్ని డబ్బున్న ఆడవాళ్ళే గద్దల్లా తన్నుకుపోతారు.వాళ్ళు రాజకీయ నాయకుల భార్యలో, ఉప భార్యలో, కూతుళ్ళొ, కోడళ్ళో అయ్యుంటారు" ఇదే అభిప్రాయాన్ని, రచయిత ఇంతకు ముందు రాసిన టపాకు నెను రాసిన వ్యాఖ్యలో వ్యక్తపరిచాను. అది నిజం కూడా!

కానీ, కేవలం ఫెమినిస్టుల వల్లే ఈ బిల్లు వచ్చినట్టు, ఈ బిల్లు పాసయితే వాళ్ళు రెచ్చిపోయి విధ్వంసం స్రుష్టిస్తారన్నట్టు ఉంది.ఈ ఫెమినిస్ట్లు, శుర్పణఖలు , పైశాచికలు ఎంత శాతం సమాజంలో! వారి ప్రభావం ఎంత?

ఈ బిల్లు నాటకమంతా మగ రాజకీయ నాయకులదే! ఇది పాసయ్యేదీ లేదూ , చట్టం వచ్చేదీ లేదు. నిన్న రాత్రి NDTV లో షబానా ఆజ్మీ మరికొందరు వీక్షకులతో జరిగిన చర్చలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమయ్యింది. మహేష్ గారు ,బాగా చెప్పారు. ఆడాళ్ళ మీద ఎవరూ దయతల్చనక్కర్లేదు. జనాభాలో సగం మంది స్త్రీలు ఉన్న ఈ దేశంలో 100 కి 33ని మంది కూడా చట్ట నిర్ణయాధికారంలో పాలు పంచుకోనివ్వని దుస్థితిలో మనం ఉన్నందుకు మన మీద మనమే జాలి పడాలి.

పురుషుల గురించి ఎంత కరుడు గట్టిన అభిప్రాయాలను ప్రగతి శీల మహిళా వేదిక కన్వీనర్ సంధ్య వ్యక్తపరుస్తుందో, స్త్రీల పట్ల అదే స్థాయి అభిప్రాయాలు ఈ టపాలో వ్యక్తమయ్యాయి.

నిర్వహణా సామర్ధ్యంలో మహిళలు పురుషులు అందుకోలేని స్థాయిలో ఉన్నారని ఇంద్రా నూయి నుంచి గ్రామ స్థాయి సర్పంచుల వరకు ఎందరో నిరూపించారు. అయినా దేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ పురుషులే తీసుకోవాలని మొండికెత్తడం ఇక్కడే సాధ్యమేమో!

charasala said...

ఈ వ్యర్థవాదాలకు దూరంగా వుందామని ఎంత ప్రయత్నించినా ఇక్కడో కామెంటు విసరక తప్పడం లేదు.

నాలాంటి పామరులు ఇలాంటి భాష వాడితే తప్పు లేదేమో గానీ, మీలాంటి పండితులు వాదనా పటిమ మీద ఆధారపడకుండా అవతలి వారిని మానసికంగా నొప్పించడం మీద వాదన నిర్మించడం సబబుగా లేదు. మీలాంటి వారికిది తగదు.

--ప్రసాద్
http://blog.charasala.com

Srinivas said...

వాదంలో ఎప్పుడయితే అనవసరపు భావోద్వేగాలకు తావునిస్తామో అప్పుడే తర్కానికి తిలోదకాలిచ్చినట్టు. మీ మనసుకేమైనా తాత్కాలికంగా ఉపశాంతి కలుగుతుందేమో కానీ ఇందులో వెళ్ళగక్కిన విపరీతమైన ద్వేషం మీరు లేవనెత్తుతున్న వాదాన్ని బలహీన పరచడమే కాక మీ మానసిక ఆరోగ్యానికీ హానికరమవుతుంది.

ఫెమినిస్టులనందర్నీ ఒకే గాట కట్టబోవడం ఒక దుస్సాహసం. ఫెమినిస్టులపైన విరుచుకుపడడం కాకుండా వారందరిపై మీకు ఈ అభిప్రాయం ఎలా కలిగిందో చెప్పగలరా?

నాగరాజా said...

అందరికీ కలిపి ఒకే ఇండియా ఉండేది అన్నారు కదా, నా దృష్టిలో అది మగ ఇండియా మాత్రమే. ఆడవారిని వంటింటికి పరిమితం చేసి అనేక విధాలుగా కట్టుబాటు చేయడం వలన మన దేశంలో మహాపరాధం జరిగింది. దాని ఫలితాన్ని ఇప్పటికీ మన సమాజం అనుభవిస్తూనే ఉంది. ఇటువంటి చర్యల వల్ల కొంత అయినా లాభం జరిగే అవకాశం ఉందని గమనించగలరు.

indianminerva said...

రిజర్వేషన్ల వల్ల యేదో ఒనగూడుతుంది అని నేను నమ్మను; అవి ఏ రిజర్వేషన్లైనా. తాడేపల్లి గారన్నట్లు అవన్నీ డబ్బున్న వాళ్ళకూ, "ఎవరో ఒకరి భార్యలకూ, కూతుళ్ళకూ, కోడళ్ళకూ" మాత్రమే ఉపయోగ పడతాయి. కాక పొతే ఏ రంగంలోనూ స్త్రీల అభివృద్ధిని ఒర్వలేని వాళ్ళుగా తయారవుతున్నాం మనం. ఒక స్త్రీ ఉన్నత స్థాయిలో ఉందంటే ఆమె కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది అని ఆలోచించే ధోరణిలోనే చాలామంది వున్నారు. ఇక కీలక పదవులు లభిస్తే మన ఆలోచనలు ఎలా వుంటాయో ఇక చెప్పక్కరలేదనుకుంటాను. ఈ "ఆడ ఇండియా" స్త్రీలు తమను తాము రక్షించుకోవడానికి ఒక తప్పని సరి అవసరమైపోవడం మన ఖర్మ.

Sai Kiran Kumar Kondamudi said...

అందరికీ సమాన న్యాయం, సమానమైన అవకాశాలు అన్న రాజ్యాంగం, రిజర్వేషన్లు అమలు చేయటంలోని ఔచిత్యాన్ని రచయిత బానే ప్రశ్నించారు. అది కొంతవరకు నిజమే. కానీ, సమాన అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు తాత్కాలికంగా రిజర్వేషన్లు కల్పించటం సముచితమే. కానీ, అదే సమస్యకు పరిష్కారమనుకోవటం తప్పు. అణగారిన వర్గాల కోసం ఆరాటపడి రిజర్వేషనులు కల్పించిన మన దార్శనికులు సమాజంలో దాదాపు సగభాగమైన మహిళలను ఎలా విస్మరించగలిగారనేది ఆశ్చర్యం కలిగించే విషయం.

మగవాళ్ళు అవకాశాలు కల్పించటంలేదనే స్త్రీలు, తమ కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు కదా! ఇప్పటి ప్రతి ప్రధాన రాజకీయపక్షంలోనూ మహిళలు ఉన్నారు. కానీ, స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలో కలిసి రాలేకపోతున్నందుకు కారణం ఏమిటి? సుష్మాస్వరాజ్, బృందా కారత్, జయలలిత, మాయావతి, సోనియా, రబ్రీదేవి... వీరందరూ పార్టీలకు అతీతంగా ఎందుకని పోరాడలేకపోతున్నారు?

ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించటంలేదని వాపోయే ఫెమినిస్టులు పై విషయాలు ఆలోచిస్తున్నట్లుగా అనిపించదు.

ఇక మన 'ఎన్నికల' విషయానికి వస్తే, చాలానే మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఏ ఒక్కరూ గెలిచినా ఓడినా, రెండు సార్లకు మించి ఎన్నికల్లో పోటి చేయరాదనే నిబంధన విధించాలి.

ఎం.పి.గా ఎన్నికౌదామనుకునే అభ్యర్ధులు కనీసం ఒక్కసారైనా (అయిదు సంవత్సరాలు) ఎమ్మెల్యేగా గెలిచి ఉండాలనే నిబంధన ఉండాలి. అలానే ఎమ్మెల్యే అవుదామనుకునే అభ్యర్ధులు కనీసం ఒక్కసారైనా (అయిదు సంవత్సరాలు) కార్పొరేటర్ గా గెలిచి ఉండాలనే నిబంధన ఉండాలి.

కేంద్ర మంత్రిగా నియమించబడే వ్యక్తులు, కనీసం ఒక రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం (అయిదు సంవత్సరాలు) ఉండి తీరాలని నిబంధన ఉండాలి. అలానే రాష్ట్రమంత్రిగా నియమింపబడే వ్యక్తులు మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉండితీరాలనే నిబంధన ఉండాలి.

అన్నిటికన్నా ముఖ్యంగా, ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధి పట్టభద్రుడై ఉండాలని, ఏ స్థాయి ఎన్నికలకు ముందైనా, ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎంట్రన్సు పరీక్ష రాసి పాసై తీరాలి.

Aruna said...

కొంత మంది ఇక్కడ, నేను ఫెమినిస్టును కాను, కాను, కాను, కాను అని అన్నా వారి మాటల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ఆడవాసన ఆ కామెంట్లలో కనపడుతోంది..నేను ఫెమినిస్టు అని చెప్పుకోవటం వల్ల ఇతర బ్లాగరుల "సానుభూతి" అవసరమయినప్పుడు కోల్పోతానేమో అన్న భయం ఇలాంటివారిలో కనపడుతుంది..ఇక పోతే ఇంకో ఆయన, భిన్నత్వంలో ఏకత్వం అంటూ సాగదీసి పనికిరాని మాటలు మాట్లాడద్దు అని బోధిసత్త్వుడి హితబోధ కానిస్తున్నారు...ఆయనకు ఈ అపారమయిన భయంకర విజ్ఞానం యే బోధి వృక్షం కింద కలిగిందో తెలిపితే అందరూ సంతోషిస్తారు...ఇకపోతే ఇంకో ఆయన పదాలు ఘాటుగా అంటూ మొదలెట్టి హైపుల లోతుల్లోకి వెళ్ళి, షావనిష్టు మూతులను నాకి వచ్చారు..ఆయన బాధ, ఈ టపా రాసినాయన బాధ కొంచెం దగ్గరగా పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం లాగా ఉన్నది... ఇక ఇంకో ఆయన వ్యర్ధ వాదాలు అంటూ మొదలు పెట్టి, అసలు రాసింది ఏమితో ఆయనకే తెలియకుండా ఉన్నది అని తన జ్ఞాన నేత్రాన్ని విప్పార్చి చూపించారు, జనాలకు బాపు బొమ్మలు, దేవతల సిత్రాలు సూయించారు..ఇక ఇంకో ఆయన మానసిక ఉద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే నా పరిస్థితే మీది అంటూ తన మానసిక పరిస్థితిని చెప్పకనే చెప్పారు...ఇంకొకాయన ఆడవారిని వంట ఇంటికి పరిమితం చేసి మహాపరాధం అయ్యింది, కాబట్టి ఒకప్పుడు చేసిన తప్పుకు నేను ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షకు ఇదే నా సమాధానం అని తన అక్కసు వెళ్ళగక్కారు...ఇంకొకరు రిజర్వేషన్లు తప్పు అంటూ తను, తనవారు వాడుకుంటున్న రిజర్వేషన్లను బయర్లోకానికి మసిపూసి మారేడుకాయ చేస్తూ కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తున్నారు... ఇంకొకరు మహిళలే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్కోకూడదు అని ప్రశ్నిస్తూ, ఈ ఫెమినిష్టుల ఆదరణకు శోభన్ బాబు లాగా సోపానాలు వేస్కున్నారు... :)..:)...:)...:)

నవ్వుకున్నవాళ్ళకు నారింజ గింజంత అని, కోపం ఉన్నవాళ్ళకు కొరివి దయ్యాలంత అని చెపుతూ ముగించటమయినది

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అరుణగారూ !

మహిళా రిజర్వేషన్లమీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అందరినీ పేరుపేరున విమర్శించారే ! ఇంతకీ మీరెవరు ? భగవంతుడా ?

బ్లాగాగ్ని said...

అరుణగారూ, చర్చపై మీ అభిప్రాయమేదో చెప్పేస్తే సరిపోయేదిగా! ఇతరుల అభిప్రాయాలను గేలిచెయ్యడమెందుకు? బ్లాగుల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదనే విషయం మీలాంటివాళ్ళు తెలుసుకుంటే మంచిది.

సుజాత said...

అరుణ గారు,
"ఫెమినిస్టు" అనే మాటకి అర్థం ఇవాళ మారిపోయింది. 'మగజాతి ' మీదే ద్వేషం పెంచుకోవటం ప్రాథమిక లక్షణంగా ఫెమినిజం మారిన పరిస్తితుల్లో ఫెమినిస్టుగా చెప్పుకోవడానికి ఏ స్త్రీ అయినా ఆలోచించాల్సిందే! నిజానికి ప్రతి స్త్రీ ఫెమినిస్టే!(స్త్రీల అభ్యుదయం కోరటం ఫెమినిజం గమ్యం అయిన పక్షంలో)

ఇంత వివరణ నేనెందుకిచ్చానంటే 'పైటను తగలెయ్యాలి ' అని నగ్న స్వేచ్చను కోరే ఫెమినిస్టుల కోవలోకి చేరడం ఇష్టం లేక 'నేను ఫెమినిస్టుని కాదు ' అని నన్ను వారి నుంచి వేరు చేసుకున్నాను కాబట్టి!

ఇంతకీ మీ అభిప్రాయమేమిటో మీరు చెప్పకుండా, అందరి అభిప్రాలమీద రివ్యూ రాశారు.

Srinivas said...

@అరుణ గారూ,

వింతైన వ్యాఖ్యానం మీది. వ్యక్తుల్ని అవహేళన చేయడమే పనిగా పెట్టుకుంటే వాదన చాలా తేలికవుతుంది (చేయడంలోనూ, బరువులోనూ). ఇప్పుడు మీరు చేసిన ఏ వ్యాఖ్యనైనా సమర్థించగలరేమో ప్రయత్నించండి.

@సుజాత గారూ,
అసందర్భమే అనుకోండి, "పైటను తగలెయ్యాలి" చదివారా, శీర్షిక చూచే అంటున్నారా?
మగజాతి మీద ద్వేషమే ఫెమినిజానికి ప్రాథమిక లక్షణమయిందని ఎందుకంటున్నారు? మీ బ్లాగులో ఒక టపా కొట్టండి.

సుజాత said...

శ్రీనివాస్ గారు,

"పైటను తగలెయ్యాలి" ని చదివాను. ఆ కవితను మొదట ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించినపుడు కత్తిరించి దాచాను. అదే కాక జయప్రభకీ మరో మరో కవికీ.. ..(శిఖామణా..? గుర్తు లేదు) కవితల రూపంలో సాగిన వాదోప వాదాలు కూడా నా దగ్గరుండాలి(కటింగ్స్).పాత ఫైళ్ళు వెదకాలి! టపా రాయాలంటే ఇవి దొరకాలి..ఇంకొంచెం స్టడీ కూడా కావాలి! టపా రాయాలనే ఉంది నాక్కూడా!