రైతుల ఆత్మహత్యలు
రైతులకు సంబంధించిన ప్రతి విషయమూ రాజకీయమై పోయిన తెలుగు వాతావరణంలో ఈ టపాకి రాజకీయ రంగు పులిమే అవకాశం ఉంది. కానీ రాయక తప్పదు.
రైతుల ఆత్మహత్యలకెన్నో కారణాలుండవచ్చు.నాకు మాత్రం ప్రముఖంగా కనిపిస్తున్నది చిన్న కమతాలు (small_land-holdings).ఎక్కడ ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నా నేను శ్రద్ధగా అతని అప్పుల కంటే అతని భూమి వివరాల గుఱించి చూస్తాను.నా పరిశీలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్ళంతా అయిదెకరాల లోపు చెలకల్ని సాగుచేస్తున్నవాళ్ళే.ఇంకా ఎక్కువ ఎకరాలు చేస్తున్న రైతులు కూడా అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చు.కాదనను.కాని అవి బాగా పొడిభూములై ఉంటాయి.అంటే వాటిల్లో ఏడాదికి ఒక పంట సక్రమంగా దిగడమే గగనం.అలాంటివి ఎన్ని ఎకరాలున్నా ఏమీ ఉపయోగం లేదు.
భూకమతపు విస్తీర్ణానికీ రైతు ఆత్మహత్యకీ ఏమిటి సంబంధం ? అంటే చాలా ఉంది.చిన్న కమతాల్లో సాగు వాణిజ్యపరంగా లాభసాటి కాదు.వాటిని సాగు చేసేవాళ్ళు ఆ పంట నంతా తమ కుటుంబపోషణకే వినియోగించాల్సి వస్తుంది (subsistence_farming).విపణిలో అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ మిగలదు.అయితే ప్రతి సీజన్‌లోను ఎకరా పెట్టుబడి మాత్రం భారీగానే ఉంటోంది.వేసే పంటని బట్టి అది ఎంత స్థాయికైనా ఎగబ్రాకొచ్చు.వరి మిరప లాంటివాటి మీద ఖర్చు ఎకరాకు పదివేల పైమాటే.అంటే మూడెకరాల ఆసామి ముప్ఫైవేల కంటే ఎక్కువే పెట్టాలన్నమాట.ప్రకృతి వైపరీత్యాల మూలంగా రెండెకరాల్లో పంట హుష్ కాకీ అనుకుందాం.ఇరవై వేలు గోవిందా ! వాటి మీద ఆదాయమూ గోవిందా ! ఒకసారి కరువొస్తేనే చిన్నరైతు పరిస్థితి ఇలా ఉంటే నాయుడుగారి హయాంలోలా మూడేళ్ళ వరస కఱువు బాధిస్తే ఏం చెయ్యాలి ? అతను అప్పులపాలు కాకుండా ఎలా ఉంటాడు ? వాటిని ఎలా తీఱుస్తాడు ? వానలు మొహం చాటేశాయని బోర్లు తవ్విస్తే మళ్ళీ 30 వేల నుంచి లక్ష దాకా అప్పు సిద్ధం.
పూర్తిగా ప్రభుత్వాన్నో ప్రకృతినో నిందించడం సమంజసమేనా ? అసలిన్ని చిన్న కమతాలు ఎందుకు తయారయ్యాయి ? ఇంతమంది స్తోమత లేని రైతులు మనలో ఎందుకు తయారయ్యారు ? మనలో 65 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండడం గర్వకారణమా ? గర్హణీయమా ?
ఇందులో అందరి బాధ్యతా ఉంది.ఉన్నవాళ్ళ దగ్గర భూములు లాక్కుని లేనివాళ్ళకు పంచడమే సోషలిజం, అదే పురోగతి అనుకున్న 1960-70ల నాటి ప్రభుత్వ విధానాల్లోను భూసంస్కరణల్లోను ఉంది అసలు కిటుకు.పండినప్పుడు తినీ తాగీ పండకపోతే ఎండిపోయే రైతుకుటుంబాల ముందుచూపులేమిలో ఉంది.మధ్యతరగతి రైతులు చనిపోతే వాళ్ళ భూముల్ని ఎకరం, రెండెకరాలు, మూడెకరాలుగా విడగొట్టుకుని నష్ట నిభాయింపు శక్తి (risk-bearing ability) లేకుండా సాగులోకి దిగిన, వారి వారసుల్లో ఉంది అసలు కారణం.మన సమస్యలకు పరిష్కారాలు మన దేశచరిత్ర మనకు నేర్పిన అనుభవంలోంచే పుట్టాలి.పరాయి దేశాల అనుభవం, వారి పరిష్కారాలూ ఎప్పటికీ మనవి కాదు.
మన దేశం వ్యావసాయికదేశం ఎందుకయింది ? అంటే సుసంపన్నమైన భారత దేశపు ఉష్ణమండల ప్రకృతిసంపద ఇక్కడి మనుషుల్ని జడభరతులుగా సోమరిపోతులుగా మార్చడం వల్ల అనుకుంటా.భారతీయ రాష్ట్రాలు ఒకప్పుడు భూతలస్వర్గాలు.ఈరోజు అధికజనాభా నరకాలు.ఒకనాటి ప్రకృతిసంపద ఇచ్చిన అతి-ఆత్మవిశ్వాసం ఈనాటి ఈ పరిస్థితికి కారణం. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదు విశాఖపట్నం మాత్రమే అనుకుంటూ వస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆయా జిల్లాల, రంగాల అభివృద్ధిని గాలికొదిలేసింది, దశాబ్దాలుగా ! ఇక్కడ పరిశ్రమలు గానీ సేవారంగం గానీ చెందాల్సినంత అభివృద్ధి చెందని నేపథ్యంలో జనమంతా వ్యవసాయం మీదపడ్డారు.ఏ చదువూ సంధ్యా లేకుండా"మా అయ్యకు మూడెకరాల పొలం ఉంది.అందులో నాకో ఎకరం వస్తుంది."అనుకుంటూ ఏ నైపుణ్యాలూ సంపాదించకుండా బతికెయ్యడానికి మన పల్లెపట్ల జనం అలవాటుపడ్డారు.వ్యవసాయానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు (వారి దృష్టిలో).కనుక వ్యవసాయం విఫలమైనప్పుడు ఏం చెయ్యాలో ప్రత్యామ్నాయ మనుగడ మార్గమేంటో వారికి దిక్కుతోచదు.ఫలితం-ఆత్మహత్య.
ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభించడం కష్టం.మాకూ గుంటూరు జిల్లాలో పొలముంది.ఈమధ్యనే అమ్మేశాం, హైదరాబాదులో కూర్చుని సాగు పర్యవేక్షించలేక.నా దృష్టిలో దున్నేవాడిక్కాదు భూమి నివ్వాల్సినది.దున్నగలిగేవాడికే భూమి ఉండాలి.ఎంత భూమైనా సరే ! దానిమీద ఆంక్షలు ఉండకూడదు.ముందు మన జనాన్ని చేతకాని వ్యవసాయం నుంచి మళ్ళించాలని, భూసంస్కరణలు రద్దుచేసి పెద్ద ఎస్టేట్లని ప్రోత్సహించాలని అంటే అదేమీ బూతుమాట కాదనుకుంటా.వ్యవసాయరంగ సమస్యలు సంక్లిష్టమైనవి.నేను వాటన్నింటి గుఱించి సమగ్రంగా మఱింకెప్పుడైనా రాస్తాను.
25 వ్యాఖ్యలు:
గవ్ అన్న. కార్పొరేట్ ఎవుసం(వ్యవసాయం) ఇప్పటి పరిస్థితులల్ల మంచిగుంటదే. సన్నకారు రైతులకు నెలకు ఐదారువేలు ఇచ్చినా వాల్ల బతుకులు బాగుపడతాయి. కంపనీల పనిజేస్తడంతే. పెట్టుబడి, ఇత్తనాలు, మందులు , లీల్లు కడ్మ ఇసయాలన్ని కంపెని జూసుకుంటది. నెలకు జీతమిస్తడు. రైతుకు tension ఉండదన్నట్టు. బాగుంటదే.
బాగా వ్రాసారు. తటస్థంగా.
ఇక పరిష్కారాలంటారా... దేశంలో నీతీ నిజాయితీ బాగుపడ్డప్పుడు, దేశం యొక్క అతి పెద్ద రంగం, స్వాతంత్రం రంగం అయిన వ్యవసాయం బాగుపడుతుంది.
అప్పటి వఱకూ, పంట కాల్వలను గుత్తేదారులు తాగుతారు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు బూజుబారిపోతాయి, వోల్కసువే-గనుల్ని సర్కారీబాబులూ, ఓబుళాపురం గనుల్ని రాజకీయ-నా-యకులు భక్షిస్తూంవుంటారు.
చిన్న కమతాలు లాభసాటి కావని మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మాకు బాపట్ల దగ్గర 40 ఎకరాల పొలం ఉండేది. (ఏకచెక్క కాదులెండి) మా భూమిని దశలవారీగా కొంచెం కొంచెం అమ్మేసినప్పుడు మా సాగుశక్తి risk-bearing ability క్రమంగా తగ్గిపోతూండడం మాకు అనుభవంలోకి వచ్చింది.
సాగురంగంలో సమస్యలు చాలానే ఉన్నాయి. నకిలీ పురుగుమందులు, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు, దళార్ల మోసాలు, సహకారసంఘాల్లో రాజకీయాలూ, నీటిపారుదల సమస్యలూ, తగ్గిపోయిన సబ్సిడీలూ, భారతప్రభుత్వం చేసుకునే అనవసరమైన దిగుమతులూ...ఇలా తల పగిలిపోయేటన్ని.
కాని ఒకటి మాత్రం చెప్పగలను. బొత్తిగా స్తోమత లేని సన్నకారు రైతులతో మనం సగటు ఎకరా దిగుబడిని పెంచలేము. వ్యవసాయాన్ని ఆధునీకరించలేము. ఉత్పాదకత విషయంలో ఇప్పటికే చైనా కంటే 30-40 శాతం వెనకబడి ఉన్నాము.
భారత దేశం వ్యవసాయక దేశం ఎందుకయింది? (చాలా మంచి ప్రశ్న ;) )
కానీ వివరణే చాలా ... (క్షమించాలి, ఇంతకన్నా ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు)
ఇకపోతే దిగుబడికి, భూ విస్తీర్ణానికి సంబంధమేమిటో కొద్దిగ వివరిస్తారా?
నిజం చెబితే అందరూ బాధపడతారు. చెప్పినవాణ్ణి తిడతారు. ఇది అనివార్యం. సరే ! కానివ్వండి. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది.
దిగుబడిని ఎకరాల వారీగా చూడ్డం ఒక ప్రణాళికాదృష్టి నుంచి మాత్రమే. కాని ఒక పొలం దిగుబడి వెనుక ఆ పొలం యజమాని అంతకుముందు సంవత్సరాల్లో నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు, అనూహ్యపరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆర్థికంగా సిద్ధమైన విధానం, అతనికి స్థానికంగా ఉన్న పలుకుబడి, అతనికి ఉన్న ఆధునిక పరిజ్ఞానం - ఇలా ఎన్నో విషయాలు పాత్ర పోషిస్తాయి.
చిన్న కమతాల రైతులకు ఇవేవీ చాలినంత ఉండవు. వారు ప్రాథమికంగా పొట్టకూటి రైతులు (subsistence farmers). వర్షాలు సక్రమంగా పడితే చిన్న కమతాలు పొట్ట నింపుతాయి. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.
మన దేశంలో చిన్న కమతాలనేవి మొదటినుంచీ ఉన్నవి కావు. మొదటినుంచి ఇండియాలో 90 శాతం పెద్ద కమతాలే ఉండేవి. వాటిల్లో ఎక్కువ భాగం జమీందారీ భూములూ, అగ్రహారం భూములూ, దేవాలయ భూములూను. గ్రామానికంతా కలిపి ఊరుమ్మడిగా కూడా కొన్ని వందల యెకరాలుండేది. చిన్న కమతాలు స్వాతంత్ర్యం తరువాత నెహ్రూ నాయకత్వంలోని సోషలిస్టు ప్రభుత్వాల సృష్టి. ఇవన్నీ ఎక్కువ భాగం భూదానోద్యమం ద్వారా భూసంస్కరణల ద్వారా ఏర్పడ్డటువంటివి. ఇవి కాక ఇంకో కేటగరీ ఉంది. స్థానికంగా ఉన్న అడవుల్ని కొట్టేసి నాయకులు వాటిని అక్రమంగా పొలాలుగా మార్చుకున్నప్పుడు చుట్టుపక్కలవాళ్ళు నోరెత్తకుండా వాళ్ళక్కూడా తలో ఎకరం రెండెకరాలూ మూడెకరాలూ కట్టబెట్టగా ఏర్పడ్డవి.
వ్యాపారానికే కాదు వ్యవసాయానిక్కూడా ఆర్థిక స్తోమత అవసరమని మనం గుర్తించిన రోజే చేతకాని రైతుల కష్టాలకు అనవసరంగా సానుభూతి చూపడం మానేస్తాం. ప్రతి మనిషికీ సాగుభూమి అవసరం లేదనీ, భూమి లేకపోవడం పేదఱికమేమీ కాదనీ, భూమి లేకపోతే కొంపలేమీ మునగవనీ మనం గ్రహించాలి.
I don't know if you are aware of it or not but the yield of paddy (the only thing I know of) has drastically increased (per acre basis) when compared to the oldne days (just post independence days). Thanks to the efforts of some of the agricultural research that has happened. I remember, my father telling me about agricultural demonstrators coming to the villages to help farmers in so many things. I have never seen them visiting villages from last 20 years atleast.
I don't know what is the acerages of Chinese ppl but if they can increase the productivity, we too should be able un;ess the fertility of their land way beyond our lands. Only thing missing is focused research in agricultural sector.
సూర్యుడుగారూ,
60 ఏళ్ళనాటికీ ఇప్పటికీ వరి దిగుబడి పెఱిగిందని నాకు తెలుసు. కాని అలా పెంచినవి చిన్న కమతాలు కావు. పంటని మధ్యలోనే ఎండిపోకుండా కాపాడిన నవతరం ఎరువులూ, కీటకనాశినులూ మాత్రమే. శాస్త్రశోధనలు చిన్న కమతాల రైతులకు మేలుచెయ్యగలిగితే అవి ఇప్పటికే ఆ పని చేసి ఉండాలి. అవి చెయ్యలేకపోతున్నాయి. వేలాదిగా కొనసాగుతున్న సన్నకారు రైతుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనం. అయితే అవి ప్రతివాడికీ వ్యవసాయంలో వేలుపెట్టాలనే దురాశని మాత్రం కలిగించాయి.
ఆత్మహత్యల సమస్య ప్రధానంగా risk-bearing ability కి సంబంధించినది. చిన్న కమతాలతో ఆ ability రానేరాదు.
It makes pretty good sense to quit a profession if it does not and can not pay you enough to survive. It's as simple as that. There's no reason why we should want small farmers to carry their load of heavy debt on their heads and continue as farmers, as relics and victims of some dated socialist policies of a few misguided and ill-advised men in power in a bygone era.
చిన్న వ్యాపారి నడపలేక దివాలా ఎత్తిన దుకాణాన్ని పెద్ద వ్యాపారి కొనుక్కుని లాభాల బాటలో నడిపించుకుంటాడు. తప్పేముంది ?
మళ్ళీ మన ఆంధ్రదేశం పెద్ద పెద్ద ఎస్టేట్లతో కళకళలాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అప్పుడు మన వ్యావసాయిక శక్తి సంపూర్ణంగా సద్వినియోగం చెయ్యబడుతుంది. నగదు (Cash) చేతిలో లేనివాడు సణుగుతూ గొణుగుతూ ఏడుస్తూ ఏడిపిస్తూ ఉంటాడు కాని ఎప్పటికీ సామాజిక సాంకేతిక మార్పులు తేలేడు. స్తోమత ఉన్నవాళ్ళకే వ్యవసాయం.
@తాడేపల్లి గారు
చాలా విషయాలు తెలుస్తున్నాయండీ మీ బ్లాగు చదువుతుంటే... పార్టీలు ఓటు బాంక్ రాజకీయాలు పక్కన పెట్టి సరైన ప్రణాలికలు రచిస్తే బాగుండు... చిన్న కమతాల రైతులు వేరే రంగాలలో అడుగుపెడితే స్వయం పోషణ, సమృద్ధి కొశం వాళ్ళు ఎవరి మీదా ఆధార పడాల్సిన అవసరం లేదు... నేను గమనించినంత వర్కు చిన్న రైతులు వ్యవసాయం వదిలేసి వాళ్ళ సక్తిని వేరే రంగాల మీద మల్లించినప్పుదు మేలు జరిగింది... రాను రాను చిన్న కమతాల సంఖ్య పెరిగిపొతుంది, అగ్ర కులాల వాళ్ళు(గతం లొ కలిగిన వాల్లు అనుకుని అయిన చదవచ్చు) వ్యవసాయం వైపు మొగ్గు చూపడం క్రమేపి తగ్గుతుండటం వల్ల.. అలా జరుగుతుండడం వల్ల వాల్ల పొలాలు కూలీలు చిన్న రైతులు కొంచెం కొంచెం కౌలుకి తీసుకొవడం... ఒక్కో ఎకరం కొనుక్కొవడం వల్ల చిన్న కమతాలు పెరిగిపొతున్నాయి... ప్రభుత్వానికి రాయతీలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది... ఎంత రాయితీలు ఇచ్చినా ప్రక్రితి విపరీతల మీద ఆధారపడే పని కాబట్టి చాలా సార్లు అనుకున్నట్టు ఉత్పాదన జరగడం లెదు... ఆటు పోట్లని తట్టుకునే సామర్ధ్యం(రాయితీలు ఇచ్చిన తరవాత కూడా) వాళ్ళకి ఉండడం లేదు....
దీనికి ఏదొక పరిష్కారం ఆలొచించాలి ప్రభుత్వాలు...
చాలా చాలా థాంక్స్ అండి నన్ను ఆలొచింప చేసి, వ్యవసాయం మీద అయోమయ స్థితిలో ఉన్న ఆలోచనలకి ఒక రూపు వచ్చింది
నేను మీతో ఏకీభవించడంలేదు.
-- ప్రస్తుతానికి ఇంతే.
చక్కటి విశ్లేషణ. నెహ్రూ గారు, భారత దేశాన్ని కొట్టిన ఎన్నెన్నో దెబ్బలలో ఇది ఒకటి. These so called land reforms. మా పెదనాన్న గారి పరిస్థితి కూడా 1972లో family celing limit మరింత తగ్గించడంవల్ల కామందునుండి చిన్నకారు రైతుకు వచ్చింది. పోనీ అలా విభజించడం వల్ల అవి సక్రమంగా వినియోగింపబడుతున్నాయా అంటే అదీ లేదు. చాలా మంది స్థోమత లేక తమ భూముల్ని బీడు పెట్టేశారు. ప్చ్!
@taaDEpalli lalitaasubrahNyam
I can say one word on your analysis: "Completely flawed"
I did not say that small farm lands increased the yield of paddy. A given fam land by itself cannot increase the yield. You need to use menure, either bio or chemical based to increase its yielding power. At the same time research can be done of the seeds itself (this is independent of the land) to increase the yield of a crop.
Also, Govt. can do a lot in this regard by helping the farmers on letting them know what kind of the land they have, what kind of crops they can culitvate, what menures they need to use to increase the yield, what pesticides they need to use for various deseases. Why can't they controll duplicates in the pestisides, if they have that will.
We all have another great quality: just blame some one, whom everyone blames, take Nehru and beat him to death (he is not ailve anyway) for whatever he has done again and again, don't worry, he will not come back and try to defed himself or anything like that, take a stone throw again on him, who cares han ;)
@Murali
Please read
http://economictimes.indiatimes.com/Editorials/The_rediscovery_of_Nehru/articleshow/2539042.cms
మనం ఏ వాతావరణంలో జీవిస్తున్నామనే దాన్ని బట్టి మన ఊహలూ ఉత్ప్రేక్షలూ మంచీచెడూ ఆలోచనలూ ఉంటాయి. మనం హైదరాబాదులాంటి నగరంలో నివసిస్తూ ఉంటే సొంత ఫ్లాటూ, సొంత బైకు లేకపోవడం, కంపెనీల్లో షేర్లు లేకపోవడం మొదలైనవి ప్రాణాంతకమైన పేదఱికంగా అనిపిస్తాయి. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకు సొంత పొలం లేకపోవడం దుర్భర దారిద్ర్యం కింద జమ. ఇదంతా మానసికమైన కాంప్లెక్సే తప్ప నిజంగా భౌతికమైన దైన్యం కాదు. (నా వ్యక్తిగత విషయానికొస్తే నా చేతిలో ఏ ఆస్తీ లేని రోజుల్లోనే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను)
అందుచేత "చేతకాని వ్యవసాయం మానెయ్యండయ్యా బాబూ ! ఆ పొలాలు వదిలిపెట్టి ఇంకేదైనా చేసుకోండి నాయనా !"అంటే పల్లెటూరివాళ్ళకు పిచ్చికోపం వస్తుంది.వాళ్ళని వెనకేసుకొచ్చే పట్నం మనుషులకూ అలాగే కోపం వస్తుంది.ఈ పట్నం వాళ్ళు ఇంకా ఎఱ్ఱజెండాల ప్రచారం మీదా మీడియా యొక్క infallibility మీదా అచంచల విశ్వాసం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఏ కాలంలోనైనా ఏసమాజమైనా ఉన్న పళాన పాత విషయాల్ని నమ్మకాల్నీ సిద్ధాంతాల్నీ వదిలిపెట్టడానికి అంత సులభంగా ఒప్పుకోదు. అది చాలా సహజం. పరిష్కారం లేనంతగా పరిస్థితులు విషమించాక మాత్రమే సమాజం అసలు విషయాన్ని గుర్తిస్తుంది. అప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండానే మారుతుంది. ఈ లోపల పాత నమ్మకాలతో జనం చాలామంది బలైపోవాల్సిందే.
I had a different kind of opinion on you when I started reading your posts. But your recent posts changed my opinion. Hats off Mr. Subramanyam.
suave గారూ
If I start writing just for the consumption of the public, to win their accolades and to remain click-happy, my sincerety, originality and credibility as a writer will be at stake. I am equally prepared for both bouquet and brickbats. I am not duty-bound to toe the beaten tracks and sing paens for populist ideologies. But there is too much intolerance for diversity of opinions in our Telugu blogosphere.
ఏమీ అనుకోకండి, మీ వ్యాఖ్య నాకు అర్థం కాలేదు. కాని నా బ్లాగు చదివి వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు.
"చేతకాని వ్యవసాయం మానెయ్యండయ్యా బాబూ ! ఆ పొలాలు వదిలిపెట్టి ఇంకేదైనా చేసుకోండి నాయనా !"అంటే పల్లెటూరివాళ్ళకు పిచ్చికోపం వస్తుంది.వాళ్ళని వెనకేసుకొచ్చే పట్నం మనుషులకూ అలాగే కోపం వస్తుంది.
Dear Sir, there are much better people there at the highest levels to think about these things. BTW, do you have any better job for all those small farmers, if they quit farming and make a better living?
Are you realizing, what you are talking about; as if like a phropet, advising the whole farmer community. On top of that, looking for tolerance on difference of opinion. Do you have a tolerance for policies of other parties/idealogies (I am talking about errajenDaas here, even I don't like it but ...).
ఒక్కొక్క వ్యక్తి,నలుగురికోసం శ్రమకోర్చి,కృషి చేస్తే,సమిష్టి వ్యవసాయం మేలని, అది ఇస్తుందెంతో ఫలసాయం అని శ్రీశ్రీ ఎదో పాటలో రాసిన గుర్తు.చిన్న కమతాలు కలిపి ఒకటే పెద్దది చేస్తామని ఏ రాజకీయ నాయకుడూ చెప్పడు. అట్లా చెప్తే వోట్లు రావు, అని భయం.
@ తాడేపల్లి గారు
ముందు ముందు అంతా పెద్ద కమతాలే జరుగుతాయండి.. ఇప్పటికే మదెర్ డైరీ ,అమూల్ లాంటి సంస్థలు వల్ల కాంట్రాక్ట్ ఫామింగ్ ఊపందుకుంటుంది.. దీని వల్ల రైతులు ప్రభుత్వం మీద ఆధారపడకుండ లాభాలు పొందుతున్నారు.. మెల్లగా ఇది చాలా వరకు వ్యాప్తి చెందుతుందని నా నమ్మకం..
భిన్న కోణాలని పరిశీలించకుండా చేసే విమర్శ ని స్థిత ప్రజ్ఞత కలవారు స్పందించరు అని నేను విన్నాను...
దీపు గారూ ! మీతో ఏకీభవిస్తున్నాను.
సూర్యుడు గారూ !
When I thought I have said enough and called it a day, I am again prompted to dwell at length on the obvious. Taxing, though, I take it upon myself to answer you as it is part of a well-meaning blogger's job. If writing is like cooking, answering comments is like dish-washing. You are condemned to the latter, if you can not resist the temptation for the former.
"better people (you mean - better than I...eh ?) are up there" to think of these matters, implying that I am not eligible to speak on these matters. OK, granted. You're right. I am only a layman who was just an ex-landlord.
But, then I wish to know what these "better people up there" have been doing all these years ? Did you know, just a couple of days ago, a petition was made to the High Court of Andhra Pradesh, stating that 20,000 (yeah, you are not mistaken, literally twenty thousand) formers have committed suicide in the State since 1991. Shall we wait for this toll to escalate to 20 lakhs, praying to the "better people up there" to think of our farmers plight ? Are we not going to open our eyes to magnitude of the crisis until everything is over ?
These farmers did not die of a B-52 bomber attack. Nor did they join the majority due to a tremor in the bowels of the earth. They died of the disabilities inherent in a profession they took up. There's no other reason why they alone should commit suicide while all those engaged in other crafts are above the ground.
Renowned agricultural scientist, Sri M.S.Swaminathan has recently given a talk on how to curb farmers' suicides. But, I must say, I failed to find in his speech what I hoped to. He too spoke all standards cliches like making small holdings viable, extending loans once again at 4% interest etc. These measures were already in place. Yet, they failed. Why ?
Ironically, agriculture is the most pampered sector over decades since Independence, with a permanent tax holiday, innumerable subsidies, irrigation projects at public expense, support prices running into billions of dollars, free training camps for farmers, purchase of spoilt grains through State Trading Corporations and other State agencies, loan waivers on the eve of elections-one is tired of quoting this endless list.
At the same time, none of the other sectors have been as fortunate. Yet, they did thrive, but not the over-pampered agriculture, why ? Even after enjoying so much and so long State patronage and sucking the nation dry, people merrily poke an accusing finger at the government, charging it with negligece and anti-farmer policies. Why ? Still they want something more to flow from the government. No sector can develop this way, straddling on the crutches povided by somebody for ever and ever and ever.
Our nation has already gone bankrupt on account of its agi-policies. 35 per cent of the nation's population are made to pay for the rural people's joyous tax holiday until the Day of Judgment. This is a clear conspiracy against the nation by Nehru and his co-socialists. Most of our politicians own lands. They all thus permanently escaped all tax on their own income , cloaking themselves behind the meek farmer label. The sooner we see through this game, the better for us.
One Tadepally preaching to millions of farmers like a prophet ?
Sorry Sir, I did not arrogate that position to myself. Your brother need not be a prophet in order to advise you. He's just your brother and that amply qualifies him to advise you in the moment of your distress. After all, all the so-called prophets had not descended down from the heaven but rose from the ranks of very commonplace human beings like us.
It was you who did not know what I mean, but I do. When I advise the farmers of humble means to quit farming, understand that I am not asking them to go on streets abegging. Nor am I asking the entire poor farming community to starve themselves to death and spare us the disgrace of suicides. Nor do I want multinationals to grab our agriculture. Nor could I be branded as an enemy of our farmers simply on account of my prefernce for bigger holdings. My care and concern for the agricultural health of the nation is no less than yours.
The kind of rudderless predicament that our farming community currently finds itself in, was not the work of a day or two. So, dumping all our excess farmers into other sectors can not happen over night. First of all, there is a need to spread the awareness and realization that farming is not here for everybody. Then, corrective action will duly follow.
As for my tolerance, Sir, I am open to and familiar with every hue of ideology and thought pattern. That's why, I know something of everything.
Thank You for taking the time off to read and comment on my blog.
@సూర్యుడు
Hitler will be still crticised after all these years. Nobody would feel, "Ah, the poor man cannot come back from the dead and defend himself. It's so easy to blame him!"
Similarily, history jugdges people, and leaders even more harshly. Actually Nehru got away with less rebuke than he deserves.
As far as the link you asked me to go and read, I did that. That article itself talks about a lot of mistakes/blunders Nehru has been attributed with, but pretends as if that's not really true. It suprisingly doesn't back it up with evidence, because, surprise surprise, there's none.
Nehru royally screwed up from Kashmir to China to Socialism to filling IHRC with Communitsts to alienating America to distancing India from Israel to promoting dynastic rule to subverting all democratic institutions to many more.
Nehru survived in the old Congress purely because of the Mahatma's blessings. He never won an election.
To top all this, he was a shameless womanizer, anti-Hindu, publicly ashamed of being a brown man(he himself said so) and in short, the kind of "leader," a burgeoning nation didn't need.
He might be your idol. He is certainly not mine.
ఉమ్మడి వ్యవసాయం అన్న కాన్సెప్ట్ మీద తోడికోడళ్ళు అనే సినిమా వచ్చింది. ఆ ఐడియా ఎందుకు పాపులర్ అవ్వలేదా అనుకున్నా. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ "మార్గదర్శి" లో ఒక మాట అంటారు... "ఈ మధ్య కొత్త నినాదం ఒకటి వినపడుతోంది పల్లెలకు మళ్లండి అని. చిన్న చిన్న భూములున్న వాళ్ళు, భూముల్లేని నాలాంటి వాళ్ళు పల్లెలకు మళ్ళి చేసేదేముంది? మన దేశం లో పరిశ్రమలు అభివృధ్ధి చెందకపోడానికి ఈ నినాదం కూడా కొంత కారణమౌతోందని నా ఉద్దేశ్యం."
బాలసుబ్రహ్మణ్యం గారు, చాల చక్కగా రాస్తున్నారు. అభినందనలు.
@Tadepalli garu
This is really wonderful. Had I not visited your blog, I really might have missed something... Expecting more number of posts on these lines...
So much for the cliched talk of making small farming units economically viable. The talk is no more brilliant than the idea of making a Marilyn Munroe of a chimp. Small units suit and serve the leftist agenda fine, because you will have no issues to fight on, unless poverty is immortalized in one form or the other. Those pitching for more and more land reforms and small units effectively want us to unlearn all our collective experience with such measures in the past.
తాడేపల్లి గారు, చాలా బాగా వ్రాశారు. మీరు వ్రాసిన దానితో నేని ఏకీభవిస్తున్నాను. పెద్ద కమతాలతో లాభసాటి వ్యవసాయం చేయవచ్చనడానికి మా ఊరి రైతులే నాకు ప్రత్యక్ష ఉదాహరణ. మా ఊరి రైతులు శెనగ బాగా పండుతుండటంతో చుట్టు పక్కల ఊర్లలో కాళీగా వదిలేసిన పొలాలను తక్కువ రేట్లకు కౌలుకు తీసుకొని పండించడం మొదలు పెట్టారు. అలా ఇప్పుడు మా చుట్టు పక్కల 3-4 జిల్లాలలో తక్కువ కౌలు ఉన్న ప్రాంతలలో ఒక్కొక్కరూ 50-100 ఎకరాలు కౌలుకు తీసుకొని లాభదాయకమైన వ్యవసాయం చేస్తున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా చేయడం వల్ల ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండగలిగారు. ఇలా ఆర్థికంగా కొంత బలంగా ఉండటం వల్లనే, గత సంవత్సరం శెనగకు మద్దతు ధర తక్కువగా ఉన్నప్పటికీ కొంత వరకు తట్టుకొని నిలబడగలిగారు మరియు స్థానిక రాజకీయ నాయకుల సహాయంతో ముఖ్యమంత్రి మీద కొంత వత్తిడి తెచ్చి, మద్దతు ధరను కొంత వరకు పెంచుకోగల్గారు.
"మనం ఏ వాతావరణంలో జీవిస్తున్నామనే దాన్ని బట్టి మన ఊహలూ ఉత్ప్రేక్షలూ మంచీచెడూ ఆలోచనలూ ఉంటాయి. మనం హైదరాబాదులాంటి నగరంలో నివసిస్తూ ఉంటే ..." ... ఈ వ్యాఖ్యలో మీరు చెప్పినవిషయం పూర్తిగా నిజం. స్వానుభవంతో చెబుతున్నాను.
ఇక, సేద్యం గిట్టుబాటు కాదనేది పల్లెల్లో అందరూ అనుకునే మాటే. ముఖ్యంగా చిన్న కమతాలున్న వ్యవసాయదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప తన బిడ్డలను రైతులుగా చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. సేద్యం మానేయండనే వారూ వారి బిడ్డలకు చెబుతున్నారు. వీలైతే చిన్న టీకొట్టు పెట్టుకొనైనా సేద్యపు విషవలయం నుంచి బయటపడాలనేది ప్రతి తిన్న రైతూ చేసే ప్రయత్నమే. ఈ మాట ముఖ్యమంత్రి చెప్పగానే మిగతా జనానికి తప్పుగా తోచింది.
అయ్యా సూర్యుడు గారూ,
ముందు గొయ్యుందని చెబితే..లేదు లేదు నన్ను మోసుకుంటూ వెళ్ళి వేరేదారిన పెడితేగానీ నేనీ దారిని పోవటం ఆపను అనటం..ఎంత మాత్రం సమంజసం.
ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన తొలి బాధ్యత రైతులదేనండి. మొండితనానికి, మూర్ఖత్వానికీ కొన్ని హద్దులుండాలి
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.