మఱోపక్క తెలుగు సినిమా వ్యాపారంలో ప్రజాస్వామికతత్త్వం కొఱవడింది.ఇప్పటికే పాదుకుపోయినవాళ్ళ కొడుకులు తిష్ఠవేసి కొత్తవాళ్ళు రాకుండా చూసుకుంటున్నారనేది మనకందరికీ తెలుసు.దానికి తోడు సినిమాల పంపిణీ వ్యవహారాలు ఒక డజను మందికి పరిమితమైపోయాయి.వాళ్ళని చూస్తే అందరికీ భయమే.వాళ్ళు పంపిణీ వ్యాపారమే కాక ఇంకా చాలా వ్యాపారాలు కూడా ఏకకాలంలో చేస్తున్నారు.సినిమా షూటింగు మొదలుకాకముందే ఎవరు ఏ పాత్ర ధరించాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు.ఎందుకంటే ఎవరు పంపిణీ చెయ్యాలో ముందే నిర్ణయమైపోయి ఉంటుంది కనుక.ఆ పంపిణీ చేసేవాడికి నష్టం రాకూడదు కనుక.ఈ మర్యాదలు పాటించని నిర్మాతలూ దర్శకులూ తరువాత బాధపడాల్సి వస్తుంది.అందుకని సినిమా షూటింగు మొదలయ్యే రోజే పంపిణీదార్లని పిలిచి స్విచ్చాన్ చేయిస్తూండడం కూడా కద్దు.ఇదంతా ఒక పెద్ద సంక్లిష్టమైన నెట్‌వర్కుగా, మహాబలీయమైన మాఫియాగా ఎదిగిపోయింది.స్వయంగా లోకకంటకులూ నిరంకుశులూ పచ్చి స్వార్థపరులూ ఐన సినిమావాళ్ళు వీడియో పైరసీ అంటూ ఏడుస్తూంటారు.నిర్మాత నష్టపోతే తెలుగు సినిమానే ఉండదని ఉద్ఘోషిస్తూంటారు.ఏ కారణం చేతనో మనవాళ్ళకు సినిమావాళ్ళంటే యమజాలి.అందుకని మన బుద్ధిలేని మధ్యతరగతి పాత్రికేయులు కూడా వాళ్ళతో గొంతు కలిపి ఈ విషయాల మీద ఆఱున్నొక్కరాగం ఆలపిస్తూ ఉంటారు.
సినిమావాళ్ళ మీద జాలిపడ్డానికేముంది ? వాళ్ళకు "MAA"(Movie Artistes' Association) అని దిష్టితీసిన ఎండు మిఱపకాయలా ధ్వనించే ఒక దిక్కుమాలిన సంఘం ఉంది.సదరు పేరుని ఒకసారి గమనించండి.అందులో ఏ విధమైన సెంటిమెంటూ లేదు.Movie artistes అంటే ఎవరు ? ఏ భాషవాళ్ళు ? ఏ దేశానికి చెందినవాళ్ళు ? ఏ రాష్ట్రానికి చెందినవాళ్ళు ? ఎవరి ప్రయోజనాలు కాపాడ్డానికి ఇలాంటి పేరు పెట్టుకున్నారు ? అవన్నీ మనం అడక్కూడదు.అమాయకంగా వాళ్ళని చూసి నిలువునా పులకించిపోవాలంతే ! ఆకాశరామన్నలాంటి ఈ పేరు ఏ ఇతరభాషల సినిమా సంఘాలకీ లేకపోవడం గమనార్హం. సదరు సంఘం వల్ల ఈ భూప్రపంచంలో ఎవరికీ ఇసుమంత ప్రయోజనం లేదు, దాని పేరు లాగానే ! అయితే శేఖర్‌దాదా అధికారంలోకొచ్చిన కొత్తల్లో వీళ్ళంతా వెళ్ళి ఆయన్ని కలుసుకుని "మా MAA కి సొంత కార్యాలయం కట్టుకునే నిమిత్తం జూబిలీ కొండల్లో గాని బంజారా గుట్టల్లో గాని ఒకటి-రెండెకరాల స్థలం ఇప్పించవలసిం"దని వేడుకున్నారు."అందరికీ స్థలాలిచ్చే మురళీమోహన్ (పాత నటుడు) ఉండగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారే"మని చుఱక అంటించాడు శేఖర్‌దాదా.మొత్తం మీద స్థలం ఇవ్వలేదు.
అడిగినవాళ్ళు సామాన్యులు కారు.కొమ్ములు తిరిగిన మఱియు తిరుగుతున్న, కోట్లకు పడగలెత్తిన మహానటులూ దర్శకులూ పంపిణీదారులు.ఏంటో పాపం ! వీళ్ళందరూ కలిసి చందాలేసుకుంటే MAA కి ఎకరం స్థలం రాదా ? కాని ప్రతివాడికీ ప్రభుత్వం (అంటే ప్రజలు) నెత్తిమీద చెయ్యి పెట్టి బ్రతుకుదామనే సదాశయమే మఱి !
ఇలాంటివాళ్ళున్న తెలుగు సినిమారంగంలో వ్యాపారవిలువలు వెనకబట్టి కళావిలువలు పెరుగుతాయని ఏ మొహం పెట్టుకుని ఆశించగలం ?
2 వ్యాఖ్యలు:
fantastico!
fantastico!
fantastico!
fantastico!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.