1990-91 ప్రాంతం. దక్షిణ గుంటూరు (Guntur South) నగరంలో ఒక సవిలాసమైన పేట. ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన చల్లని సాయంకాల వేళ.నేనూ మా మిత్రుడు పేరూరి సత్యనారాయణా మేడ మీద తలో కుర్చీలో కూర్చుని పిచ్చాపాటీ మాట్ల్లాడుకుంటున్నాం."ఓ కధ చెప్తా వింటావా బ్రదర్ ?"అన్నాడు సత్యం."సరే ! చెప్పు"అన్నాను.సత్యం మొదలుపెట్టాడు :
"పూర్వకాలంలో ముగ్గురు మాంత్రికులుండేవాళ్ళు.వాళ్ళందరికీ తమ తమ భార్యల మీద పుట్టెడు అనుమానం.అందుచేత వాళ్ళని చిన్నచిన్న బొమ్మలుగా మార్చేసి సంచీల్లో పెట్టుకుని తిరుగుతూండేవాళ్ళు.అవసరమైనప్పుడు మాత్రం మళ్ళీ నిజస్వరూపంలోకి తెచ్చేవాళ్ళు.ఇలా కొంతకాలం గడిచాక ఆ ముగ్గురూ తీర్థయాత్రలు చెయ్యాలని బయల్దేరారు.దారిలో ఒక కొలను కనిపిస్తే స్నానం చెయ్యాలనిపించింది.సామాన్లు గట్టున పెట్టి కొలనులోకి దిగితే ఎవరైనా వాటిని ఎత్తుకుపోవచ్చు.అందుకని సంచీల్లోంచి భార్యల బొమ్మల్ని బయటికి తీసి వాళ్ళని యథాస్వరూపాల్లోకి తెచ్చి"సామాన్లు చూస్తూండండి"అని చెప్పి కొలనులోకి దిగారు.వాళ్ళు అలా కొలనులోకి దిగీ దిగగానే ఈ ముగ్గురు ఆడవాళ్ళూ తమ బట్టల్లోంచి తలా ఒక మగబొమ్మ బయటికి తీసి అక్కడికక్కడే కార్యక్రమం మొదలు పెట్టారు.మధ్యలో ఎందుకో తలతిప్పి వెనక్కి చూసిన మంత్రగాళ్ళకి దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు."
అంతటితో కథాపి"హహ్హహ్హా"అని నవ్వాడు సత్యం.నేనూ నవ్వాను.16-17 ఏళ్ళ తరువాత దృశ్యం మారిస్తే-
"సరే ! చెప్పండి మేడమ్ !"
"మా స్నేహితురాలికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు.బడికెళుతున్నారు.భర్తది మంచి ఉద్యోగం.ఆమెకి ఎక్కడో ఒక అబ్బాయి-తన కన్నా వయసులో చాలా చిన్నవాడు-పరిచయమయ్యాడట.ఆ పరిచయం స్నేహంగా మారి చాలా దూరం వెళ్ళింది.నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంటే-ఆఫ్టరాల్ ఓ పసుపుతాడే కదా అని మూసేసి ఉన్న గుళ్ళో మూడో కంట పడకుండా రహస్యంగా తాళి కట్టించుకుందంట.దేవుడి గుళ్ళో అయితే ఏం చేసినా ఏమీ కాదని ఎప్పుడో ఎవరో చెప్పారట.ఇప్పుడేమైనా సమస్యలొస్తాయేమోనని భయపడుతోంది.ముఖ్యంగా భర్తకి తెలిస్తే....అని"
"ఆఁ...!"అని ఆ కథలో మంత్రగాళ్ళలా దిగ్భ్రాంతి చెంది నోరు తెఱవడం ఇప్పుడు నా వంతు.




2 వ్యాఖ్యలు:
కుటుంబం మీద ప్రేమ .. సంసారం మీద అవగాహన లాంటివి లేనివాళ్ళు చేసె పనులివి..ఎటొచ్చి నేను ఈనాడు శీర్షిక చూసి వ్రాసిన నా కధకి దీనికి పెద్ద తేడా ఏమి లేదు..కాస్త ఉపమానలంకారం తొడయ్యింది.. అప్పటినుండి .. ఇప్పటిదాక అవే కధలు అని చెప్పుకోదగ్గ వాస్తవాలు.. అడిగానని అనుకోవద్దు.. మీరు పురుష పక్షపాతి లా వున్నారే... తప్పంతా ఆడవాళ్ళదే అన్నట్లుంది కధ.. మగవారికి ఎందుకంత అనుమానం.. అక్కడ ఈమె ప్రేమించింది కూడా ఒక మగవాడినేగా .. అతనెంత ప్రొధ్భలం చేసుండకపొతే?? ఇక్కడ ఈ మంత్రగాళ్ళ అనుమానమే వారికి ప్రొత్సాహంగా మారిందేమో.. బార్య - భర్త ఇద్దరిమద్య ఆప్యాయతానురాగాలు వుండాలి కాని ఇలా అనుమానాలు . అసూయలు.. ద్వెషాలు కాదు.. అప్పుడే వారిమధ్య వున్న భందం గట్టిపడ్తుంది..
మీరు మొదట చెప్పిన మాంత్రికుల కథ "భట్టి విక్రమార్క" పుస్తకం లోనిది. ఇరవయ్యో ..ఇరవై రెండో బొమ్మో చెప్పే కథలో వస్తుంది ఇది.
Post a Comment