"రాజమండ్రికి రానుపోను రెండు విమానం టిక్కెట్లు కావాలండీ"అని చెప్పాను, ఆ బల్ల ముందున్న కుర్చీలో కూర్చోబోతూ.ఆ గుమాస్తా నేనడిగిన టిక్కెట్లని పుస్తకించడం మొదలు పెట్టాడు.ఆ గదిలో కలనయంత్ర మీటకాల (computer keyboards) టిక్కుటిక్కులు మినహాయిస్తే మొత్తం మీద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
ఇంతలో పంజాబీ దుస్తుల్లో ఉన్న ఒక యువతీ లలామ ఆ గదిలోకొచ్చి నా పక్కకుర్చీలో కూర్చుని"గోవాకి రెండు విమానం టిక్కెట్లు కావా"లని చెప్పింది. "స్పైస్‌జెట్ తీసుకుంటారా మేడమ్ ! ప్రస్తుతం బాగా తక్కువ ఖర్చులో అదే నడుస్తోంది" అన్నాడు గుమాస్తా. "సరే"నన్నదామె. అతను పని ప్రారంభించాడు.
ఆమె వయసు 22-23 కు మించకపోవచ్చు. పడిపోయేంత అందగత్తేమీ కాదు.కాని ఫర్వాలేదు. ముఖ్యంగా శరీరచ్ఛాయ అతిసాధారణం.మనిషి సన్నగా ఉంది. ఇంగ్లీషు కూడా ధారాళంగా మాట్లాడ్డాన్ని బట్టి విమానం టిక్కెట్లు పుస్తకించడాన్ని బట్టి చూస్తే పుష్కలమైన సొంత ఆదాయ వనర్లున్నాయనిపించింది. ఆమె మాట్లాడుతున్న తెలుగుని బట్టి చూస్తే కరీమ్‌నగరో నిజామాబాదో అయివుండొచ్చని ఊహించాను.
ఈలోగా ఆమె తన కర్ణపిశాచి(సెల్లు)ని బయటికి తీసి ఎక్కడికో మాట్లాడసాగింది. అబ్బే ! చాటుమాటేమీ లేదు. నా పక్కన కూర్చుని బాహాటంగానే మాట్లాడుతోంది. స్పష్టంగా వినపడుతున్నా కూడా అలా కనపడ్డం ఇష్టం లేక నేను ఎటో మొహం పెట్టాను. అయినా ఒక చెవి ఇటే ఉంది.
"హలో అమ్మా ! నేను."
(నువ్వా ? బావున్నావా ?)
"ఆఁ ! బాగనే ఉన్నా. ఱేపు నేనూ, సురేషు విమానంలో గోవా వెళతాం. మాకక్కడ ఎల్లుండి పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి."
(మీ నాన్నగారొస్తే నేనూ వస్తా)
"నాన్న సంగతి నాకు తెల్వదు. నాన్న కన్నా అమ్మే ముఖ్యం. కని పెంచేది అమ్మే కాని నాన్న కాదు. అందుకని నాన్న రాకపోతే పోనీ. నువ్వు మాత్రం రావాల్సిందే."
(నేనలా రాను)
"ఇదే నీకు చిట్ట చివరి అవకాశం. ఇప్పుడు రాకపోతే నువ్వు నా తల్లివే కావు. నీకు నాకూ ఏ సంబంధమూ లేదు. నువ్వెవరో నేనెవరో. నువ్వింకెప్పుడూ నా యింటి గడప తొక్కడానికి వీల్లేదు. నేనూ నీ యింటి గడప తొక్కను. బాగా ఆలోచించుకో."
(నువ్వేమైనా అనుకో మీ నాన్న లేకుండా నేను రాను)
"నీ కర్మ. నేను నీకు మళ్ళీ ఫోన్ చెయ్యను."
Thursday, September 27, 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
2 వ్యాఖ్యలు:
కైఫీయతులు అంటే అర్థం ఏమిటి?
మీ కథలు అన్ని సశేషమా లేక ధారావాహికంగా వస్తాయా?
1. కైఫీయతులు అంటే పాత రికార్డులు అని అర్థం. ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల చరిత్ర విశేషాల రికార్డులకు మెకంజీ దొర ఆ పేరు పెట్టాడు. నా బ్లాగులో నేను దాన్ని archives అనే అర్థంలో వాడుతున్నాను.
2. కలగూరగంప బ్లాగులో ఇంతవరకు కథలు ప్రచురితం కాలేదు. ఇందులో మీకు కనపడేవన్నీ నిజంగా జరిగినవే.
3. నేను ప్రచురించిన సంఘటనలన్నింటికీ అంతస్సూత్రంగా ఒక లేబెల్ పేరు కేటాయించాను. ఆ లేబెల్ మీద నొక్కితే ఆ ప్రస్తావన (topic) మీద ఉన్న అన్ని టపాలనీ ఒకే చోట చూడవచ్చు. ఉదాహరణకి-
మా నాన్నగారి స్మృతులు
లేచిపోదాం...రా !
ఈ వేరువేరు సంఘటనలు మనకిస్తున్న సందేశాన్ని చర్చించడమే వీటిని ప్రచురించడంలో గల ఆంతర్యం.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.