Sunday, September 09, 2007
రాజకీయాల్లోకి నారాయణ ?
నెల్లూరు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపక అధినేత డాక్టర్ శ్రీ పి.నారాయణ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా రాజకీయ రంగప్రవేశం చెయ్యడానికి సన్నద్ధమవుతున్నట్లు ఇంకా ధ్రువీకరించబడని అనాధికారిక భోగట్టా తెలియజేస్తోంది.ఇటీవలి దాకా శ్రీ చైతన్య (హైదరాబాద్)ని విజయపథంలో నడిపించి తరువాత శ్రీ వైష్ణవీ కళాశాలల్ని స్థాపించిన శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావుగారికి తన సంస్థల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించబోతున్నారని కూడా తెలుస్తోంది.అయితే అలాంటి గాలివార్తల మీద ఇక్కడెందుకు రాయడం ? అంటే, అలాంటిది ఒకందుకు శుభపరిణామమేనని చెప్పడానికే.
ప్రస్తుతం కాంగ్రెస్ ద్వారా అధికారంలోకొచ్చిన అనాగరికుల/అప్రాచ్యుల స్థానే విద్యాధికులూ మేధావులూ వివిధ రంగాల సాధక బాధకాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారూ స్వయంగా మహాసంస్థల్ని నడిపేవారూ పగ్గాలు చేపట్టితే బావుంటుంది.అధికారంలోకొచ్చాక సంపాదించుకునేవారు మనకొద్దు.బాగా సంపాదించుకుని అధికారాన్ని ఆశించేవారిని నేను అభిమతిస్తాను.
డాక్టర్ శ్రీ పి.నారాయణకు ప్రజల్లో మంచి మూర్తిమత్త్వం (image) ఉంది.జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన మహామనీషి, స్వయంగా అధ్యాపకుడూను.తన అదృష్టాన్ని రూపాయల్లోనే వెతుక్కున్నవాడాయన.ముఖ్యంగా అధ్యాపకుల్ని పాఠాలు చెప్పే యంత్రాలుగా కాక మనుషులుగా చూడ్డం చేతనైనవాడాయన.ఆయన గనక విద్యారంగంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఇతర కార్పొరేట్ సంస్థలు అధ్యాపకుల్ని ఏ విధంగా దోచుకు తినేసేవో ఊహకు అందదు.ఆయనతో పోటీపడ్డం కోసం అవి కూడా ప్రస్తుతం అధ్యాపకుల పట్ల మానవత్వాన్ని నటిస్తున్నాయి.అలాంటి వ్యక్తిని విద్యామంత్రిలాంటి ఒక ప్రముఖ పదవిలో చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.
శ్రీ నారాయణ ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది.ఏమైనా సింహపురికి మకుటం లేని మహారాజుల్లా వెలుగొందుతున్న "ఆనం" కుటుంబం ఇకముందు పోటీని ఎదుర్కోక తప్పదా ?
అంతా ఆ గొలగమూడి వెంకయ్యస్వామివారి దయ.
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నామాంకం (లేబెల్) : నా అనుకోలు (assumption)
Subscribe to:
Post Comments (Atom)





2 వ్యాఖ్యలు:
నారాయణ గారు రాజకీయాల్లోకి వస్తే మంచిదే! కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడు తో పాటు తానా సభలకి వచ్చి NTR FOUNDATION కి అధికారిగా చంద్రబాబు అందరికి పరిచయం చేసారు! దీన్ని ద్రిష్టిలో పెట్టుకుంటే నారాయణ తెలుగుదేశం పార్టీ లో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
నారాయణ తెలుగుదేశం పార్టీ లో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Post a Comment