రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం...
రాజీవ్ గృహకల్ప...
రాజీవ్ ఆరోగ్యశ్రీ...
రాజీవ్ రహదారి... రాజీవ్ యువశక్తి...రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్...కడపలో ఇంకేదో రాజీవ్ సంస్థ...
హైదరాబాదు కె.పి.హెచ్.బి.కాలనీకి రాజీవ్ గాంధి కాలనీగా పేరుమార్పు...
విశాకా స్టేడియమ్ కి రాజీవ్ స్టేడియంగా పేరుమార్పు...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహప్రతిష్ఠాపనలు...
రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్......
ఒకటే శారిడాన్...ఇక ఉండదు తలనొప్పి...
ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు.కారణం తెలీదు.తెలుగువారిలో రాజకీయాలకు అతీతులైన కవులు లేరా ? కళాకారులు లేరా ? సంఘసేవకులూ, సంఘసంస్కర్తలూ, త్యాగధనులూ, శాస్త్రవేత్తలూ లేరా ? అందరమూ ఇలా బతికున్న అమ్మగారి, చచ్చిపోయిన అమ్మమొగుడుగారి మఱియు అత్తగారి సేవలో తరించిపోవడానికి హేతువేమిటి ? ప్రతినెలా ఢిల్లీకి తెలుగువాళ్ళ డబ్బుతో సూట్‌కేసులు మోస్తే మోశారు, కనీసం సాంస్కృతిక స్థాయిలో నైనా తెలుగుదనాన్ని గుబాళించనివ్వరా ? దేవుడా ! రక్షించు నా రాష్ట్రాన్ని !




20 వ్యాఖ్యలు:
ఇవన్నీ చేసిన తరువాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తమ పేరును : రాజీవ్ శేఖర రెడ్డిగా మార్చుకుంటున్నారు :-)
ఈయన ఆంధ్రా వచ్చినప్పుడు ఒకసారి తెలుగువాడైన సి.యం. అంజయ్యను నా జీపులో ఎందుకెక్కావంటూ కాలితో ఒక్క తన్ను తన్నాడు... అది సరిపోతుందనుకుంటున్నారేమో?
పుట్టిన పిల్లాడికి రాజివ్ పేరు పెడితే వెయ్యి రూపాయలు ఇస్తాను అంటారు ఈ ప్రభుత్వం వారు కొద్ది రోజుల్లొ
ఆ.... ఏమవుతాడు, ఎత్తి కుదేస్తే రెండు చెక్కలవుతాడు....
సిగ్గు, ఎగ్గు లేని ముండా కొడుకులు, ఆత్మగౌరవం అంటే అదేదో అవార్డు మనకి ఎవడు డబ్బులు ఇస్తే వాడికి ఇచ్చేద్దము అని చుసేవాళ్ళు మనల్ని పాలిస్తుంటే ఇలా కాక ఇంక ఎలా ఉంటుంది....(నేనేమి తె.దే.పా కి చెందిన వాడినేమి కాదు...)
అవును. ఈయన తెలుగు వారికి చేసిన ఘనకార్యాలేమిటో కొంత చెపితే బాగుంటుంది.
ఆంత అభిమానం వుంటె వాళ్ళ కొడుకులకీ, కూతుర్లకీ పెట్టు కోవచ్చు నచ్చిన వారి పేర్లు
ఇక్కడ మరో విషయముందండోయ్! ఎంత సేపూ మేడం గారి మొగుణ్ణి పొగడ్డమే తప్ప మేడం గారి పేరు వాడ్డం ఇంకా మొదలెట్టలా? గుడ్డిలో మెల్ల. ఆ రొజే వస్తే...ఊహించుకోండి....
సోనియా భారతి (రవీంద్ర భారతి, ఇప్పతికీ నాకు డౌటే, దీన్ని ఎలా వొదిలేసారా అని )
సోనియా ఎక్స్ప్రెస్ హైవే (ఇంకా ఎవడి పేరు పట్టలా)
సోనియా పేదల బహిర్భూమి పథకం
ఇంకా ఏమేమో ...................
తప్పు లేదు, మంచి మనిషి మరియు ఇండియాకు చాలా చేసినాడు. ఈనాడు మనము IT లో TOP ఉన్న ఆది రాజీవ్ పెట్టిన బిక్ష.
ఎంత కాంగ్రెస్సువారి అమ్మ మెగుడయితే మాత్రం ఇలా రాష్ట్రం మొత్తాన్ని ఆ పేరుతో నింపెయ్యాలా? కేంద్రంలో 35 మంది రాష్ట్రానికి ఏమి తేలేని దద్దమ్మలైన MPలను, సోనియా అంటే ఏదో ఆకాశంనుండి ఊడిపడ్డ దేవత అనుకునే ఎమ్మేల్యేలను ఎన్నుకున్న మనం, వీళ్ళు పేర్లుమార్చడం తప్పితే ఇంకేమైనా చేస్తారనుకోవడం బుద్ది తక్కవే అవుతుంది.
పోస్ట్ సంగతేమోగాని కామెంట్లు భలేగున్నయ్.
మీరు ఇంకో ఇద్దర్ని మర్చిపోయినట్టున్నారు.
ప్రియాంకా..రాహుల్లూ...
సారీ....గాంధీ తగిలించుట మరిచి పోయితిని.
చప్పట్లు చప్పట్లు...
మీ ఆక్రోశమే ఎందరో తెలుగు వాళ్ళ ఆక్రోశం.
లేక లేక ప్రధాని అయిన ఓ తెలుగు వాన్ని, అదీ ఓ పండితున్ని, ఓ పంజాబ్ సమస్య నుండీ, బంగారం కొదువ పెట్టుకోవాల్సిన దుస్థితి నుండీ భారతాన్ని సగౌరవ భారతంగా మార్చిన పీవీకి ఆ వెధవలు గౌరవం ఇవ్వకపోతేమానె. కనీసం మనమయినా ఇవ్వద్దూ?
ఆయన పేరెవరికీ అవసరం లేదు. ఆంద్రులపెరును మదరాసీల నుండి తెలుగువారుగా మార్చిన అన్న పేరు వీళ్ళకొద్దు. (నేను తె.దే.పా సానుభుతిపరున్నే గానీ సభ్యున్ని కాదండొయ్!).
ఎంతసేపూ ఇందిరమ్మ, రాజీవ్... ఇది వాళ్ళు ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా కాదు ఈ నాయకుల అభివృద్దికి ఇచ్చిన చేయూతకు కృతజ్ఞతగా మాత్రమే! ఎంట కృతజ్ఞత చూపాలంటే మాత్రం ఇలా పొద్దు పొడిచిన దగ్గరనుండీ నిద్రపోయేదాకా రాజీవ్ జపం చేయాలా? ఎవడబ్బసొమ్ముతో?
ఇలా మనలో మనం తిట్టుకునే బదులు దీన్ని మరింత జాగృతి స్థాయికి తీసుకెళ్ళగలామా అనేది ఆలోచించాలి. ఆన్‌లైన్ పిటీషన్లు, సంటకల కార్యక్రమాలు ఏమైనా చేపడితే ప్రభుత్వం గుడ్డీ కళ్ళు తెరచుకుంటాయేమొ చూడాలి.
ఏ నగర రోడ్డు చూసినా గాంధీ రోడ్లు, నెహ్రూ నగర్‌లు, పటేల్ వీధులు. ఇప్పుడు అదే స్థానాన్ని ఇందిరా, రాజీవ్ ఆక్రమించుకుంటున్నారు. తెలుగు వాళ్ళే లేనట్లు! తె.దే.పా హయాంలో ఇంత వైచిత్రి లేదు. అక్కడ అందరికీ అన్నే దైవం అయినా "దీపం", "రోష్నీ", "వెలుగు", "జన్మభూమి" ఇలా వుండేవి పథకాల పేర్లు. ఈ కాంగిరేసు కొద్దిబుద్దులకు అదేం రోగమో తెలుగువాళ్ళకు ఒక ఆత్మ వుంది దానికో ఆలోచన వుంది అన్న ఆలోచనే లేకుండా ఎప్పుడూ ఆ కుటుంబపు మంత్రమే జపిస్తున్నారు.
ఛీ ఛీ వెన్నుముక లేని వెధవలు...
ప్రసాద్
http://blog.charasala.com
మనం కంప్యూటర్ రంగంలో తారాస్థాయికి చేరుకోవడానికి కర్నాటక, ఆంధ్రా తమిళనాడు రాష్ట్రప్రభుత్వాల కృషే కారణం గాని రాజీవ్‌గాంధి వెలగబెట్టిందేమీ లేదు. "కంప్యూటర్ యుగం" అంటూ అఱుపులైతే బాగానే అఱిచాడు. ఆయన అయిదేళ్ళ హయాం (1984-89)లో మాత్రం దేశం కంప్యూటరీకృతం కాలేదు. సాఫ్ట్‌వేర్ ఊసే లేదు.
గౌరీ కుమార్, ఆయన ప్రస్తుతం రౌడీశేఖర రెడ్డి పేరుతో సంతృప్తిగా ఉన్నారంట, రాజీవ్ శేఖర్ గురించి తరువాత ఆలోచిస్తామన్నారు.
***********
మాటలబాబు, రాజీవ్ పేరు పెట్టుకోని వాళ్ళకు వెయ్యి రూపాయలు పన్ను విధిస్తుందంట ప్రభుత్యం. రాజన్నను అర్థం చేసుకోవూ.......
***********
బాలచంద్రుడు గారు, ఐటీ వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే....పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, యెన్టీఆర్.....వీళ్ళ కన్నా ఎక్కువ చేశాడంటారా? ఒక వేళ చేసినంత మాత్రాన రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికీ ఆయన పేరే ఉండాలా. మన సీయెం ఐన తెలుగువాడైన అంజయ్యను జీపులోనుంచి బయటకు తోసిన కుర్ర నా 'బి'డ్డను లాఠీలతో కొట్టి బొక్కలో తొయ్యక భజనలా!! ఛీ...ఛీ...
కంప్యూటర్ పువ్వు, ప్రజా టెలిపోను "దారం", "కంప్యూటర్ యుగం" ఓ దండ. రాజీవ్ దానికి ఆధారం. కాకపోతే ఒక తెలుగు రత్నం పేరు పెట్టవచ్చు. కాకపోతే ఆయన ఆల్లుడె చెప్పులు విసిరి పరువు తీసై మనకు ఎందుకు అని ఉరుకూన్నాడు. మామ (తెలుగు రత్నం) ను త్రోకి పైకి వచ్చిన వారి పేరు కూడా ఉంది. అయిన మన పిచ్చి కాని ఒక ముస్లిం మసీదు కట్టుకుంటే దానికి శివాలయం అన్ని పేరు పెడతాడా!
అధ్యక్షా! నాకు ముందుగా పిల్లలు పుట్టేసారుకానీ,లేకపోతే నా కొడుక్కి కూడా రాజివ్ గగన్ అనే పేరు పెట్టుకునేవాడిని......
అంతా మన మంచికే! కొన్ని అయితే ఏమీ చేయలేం. భవిష్యత్తులో రాజకీయ నాయకుల పేర్లను (స్వాతంత్ర సమరయోధులు మినహా) అన్నీ తీసివేయడానికి చర్యలు తీసుకునే బంగారు అవకాశాలను ఇస్తున్నందుకు మన సామ్యూల్‌కు థాంక్స్.
అహో ఏమి ఈ వైచిత్ర్యము? నేను నిన్న రాసి పెట్టుకున్న డ్రాఫ్టులో ని సగభాగం మీ టపాలో కనిపించుచున్నదే. నా టపాని ఇప్పుడే విడుదల చేసినచో KPHB సంఘటనతో చక్కగా పేలి యుండెడిది. అయిననూ ఆపి పెట్టెద నా టపాను.
నేములో నేమున్నది అంటే ఈ నేములో భజన గణమునకు ధనమునిచ్చు పలు పథకములున్నవి. ' యధా రాజీవ్ తథా రాజశేఖర్ '
-- విహారి
http://blog.vihaari.net
ఇదెక్కడి న్యాయమో! రాష్ట్ర సర్కారు ఇందిర, రాజీవ్ నామ స్మరణకు సాక్ష్యాలివిగో..
1. ఇందిర క్రాంతి పథకం: గతంలో ఉన్న 'వెలుగు'కు ఇది కొత్త రూపం.
2. ఇందిర మేఘ మధనం: కృత్రిమ వర్షాల కోసం చేపట్టిన కార్యక్రమం.
3. ఇందిర ప్రభ: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల అభివృద్ధి పథకం.
4. ఇందిరమ్మ: అన్ని రకాల వసతులతో ఆదర్శ గ్రామాలు, వార్డుల అభివృద్ధి పథకం.
5. ఇందిరమ్మ చెరువులు: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెరువులు తవ్వే పని.
6. ఇందిరా సాగర్: పోలవరం ప్రాజెక్టు.
7. రాజీవ్ పల్లెబాట: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి గ్రామాల్లో చేసిన పర్యటన.
8. రాజీవ్ నగరబాట: మున్సిపల్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పట్టణాల్లో జరిపిన పర్యటన.
9. రాజీవ్ గిరి బాలరక్ష: గిరిజన విద్యార్థుల ఆరోగ్య బీమా పథకం.
10. రాజీవ్ అభ్యుదయ: ఇదివరకటి ఆదరణకు కొత్తరూపం. పట్టణాల్లో వివిధ కులవృత్తులు చేసుకునే వారికి పనిముట్లు అందించే పథకం.
11. రాజీవ్ స్టేడియం: రాజధాని శివారులోని ఉప్పల్‌లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియం. దీనికి విశాక ఇండస్ట్రీస్ డబ్బులు చెల్లించి తన పేరు పెట్టుకుంటే దాన్ని మార్చారు.
12. రాజీవ్ సాగర్: దుమ్ముగూడెం ప్రాజెక్టు.
13. రాజీవ్ గృహకల్ప: అల్పాదాయ వర్గాలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం.
14. రాజీవ్ స్వగృహ: మధ్యతరగతి వారికి సొంత ఇల్లు పథకం.
15. రాజీవ్ యువశక్తి: సీఎంఈవై తరహాలో యువతకు ఆర్థిక సాయం, ఉపాధి అందజేయడం.
16. రాజీవ్ ఉద్యోగ శ్రీ: ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం.
17. రాజీవ్ ఆరోగ్య శ్రీ: పేదలకు ఆరోగ్య బీమా పథకం.
18. రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్: ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం.
19. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు: శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు.
20. రాజీవ్ ఐఎంఎస్: రాష్ట్రంలో మూడు చోట్ల ప్రతిపాదించిన మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్‌లు. కడపలో ఇప్పటికే మొదలైంది.
21. రాజీవ్ ఎత్తిపోతలు: మహబూబ్‌నగర్ జిల్లాలోని బీమా ప్రాజెక్టుకు పెట్టిన పేరు.
22. రాజీవ్‌గాంధీ హౌసింగ్ బోర్డు: తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి పెట్టిన పేరు.
23. రాజీవ్ ఫ్రెష్: మార్కెటింగు శాఖ ప్రతిపాదిస్తున్న చిల్లర కూరగాయాల దుకాణాలకు పేరు. వీటి ఏర్పాటెప్పుడో తెలియదుగానీ, పేరుమాత్రం ఖరారైపోయింది.
(17-ఆగస్టు-2007, ఈనాడు సౌజన్యంతో)
మహానుభావుడు పి.వి. ని ఎంత అన్యాయంగా సాగనంపారండి....ఈ వెన్నెముక లేని మన్మోహన్ ని కాంగ్రేస్ లోనికి తీసుకు వచ్చింది ఆయనే కదా. ఇప్పుడు మన దేశం లో ఇన్ని అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలు కల్పించబట్టే ప్రజల్లో చాలా మంది సుఖంగా బ్రతుకుతున్నారు. ఇదంతా ఆ అపర చాణుక్యుడు పెట్టిన భిక్షే కదా, అప్పటి నుంచి వచ్చిన ప్రధానులంతా ఆయన వేసిన దారిలోనే వెళ్తున్నారు, కానీ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన గురుంచి తలవరెందుకు? వీళ్ళు చేసే చర్యలు చూస్తే పి.వి గురించి భవిష్యత్తు తరాలకి నిజాలు తెలియనివ్వరేమో????
నాకు కాంగిరేసు ప్రధానుల్లో నచ్చిన ఒకే ఒకడు పీవి. తెలుగు వాడని కాదు. ఆయన ధృఢ దీక్షతోనే (గిల్ సహాయంతో) పంజాబ్ అగ్నిగుండం చల్లారింది.
ఆయన ధృడ దీక్షతోనే (ఎంత మంది గింజుకున్నా మన్మోహన్‌ను అయిదేళ్ళూ ఆర్థిక మంత్రిగా వుండనిచ్చి పూర్తి స్వేచ్చ ఇచ్చారు) మన్మోహన్ ఆర్థిక శ్రంఖాలాలను త్రెంచి ఈ రోజున్న భారత్‌ను ఆవిష్కరించారు.
ఏంటయ్యా రాజీవ్ కుర్రకుంక చేసింది? అహంభావంతో అన్ని చుట్టుపక్కల దేశాల్లోనూ భారత్ అంటే భయం కలిగించారు. నేపాల్‌కు వాణిజ్య మార్గాలు మూసేసి భయపెట్టారు. లంకకు సైన్యాన్ని పంపించి మన వేలుతో మన కన్నునే పొడిపించారు (అయినా లంకీయుల్లో మన పట్ల ద్వేషాన్ని పెంచారే గానీ మరేమీ చేయలేక చివరికి అందుకే మసి అయ్యారు). చంద్రశేకరుకు మద్దతు ఇచ్చి ఆనక విరమించుకొని అచ్చం అవకాశవాద రాజకీయాన్ని ప్రోత్సహించారు. కోటరీని చుట్టు పెట్టుకొని దానితోనే పరిపాలన చేశారు.
కంప్యూటరు అని అరవడమే గానీ ఆయన చేసిందేదీ నాక్కనిపించలేదు. అయితే గియితే ఈయన హయాంలో టెలీకాం్‌కు వూతం లభించింది అంటారు ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. ఒకవేళ ఈయన చేసిన ఆవగింజంత మేలున్నా ఆయన జాతీయ నాయకుడయ్యాక మనం మాత్రమే ఎందుకాయన జపం చెయ్యాలి?
--ప్రసాద్
http://blog.charasala.com
Chethulu kalaka akulu padithe emi labham... TDP ni dinchi COngress ni gadde ekkinchindi evaru.. MANAME... idi mana tappu Rowdy sekar do leka marevarido kaadu tappu... kaani paravaleedu manalo malli chaitanyam vachinattundi andari comments chusthee... kummeyandi Rowdyni..
Post a Comment