Wednesday, July 11, 2007

మంచి మనసులకు మంచి రోజులు


"నా మంచి పనులే నన్ను గెలిపిస్తాయి."
నాయుడుగారు తన ఇటీవలి అమెరికా పర్యటనలో ఒక సందర్భంలో అన్న మాటలివి.చెడ్డ పనులు చెయ్యకపోయినా, అధికారంలోనుంచి దిగిపోయాక ఒక రాజకీయ నాయకుడు చెయ్యగలిగిన మంచిపనులేమీ ఉండవు.కనుక ఆయన ప్రస్తావిస్తున్నది"తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించే"అని తెలుస్తోంది.ఇకముందు గెలిపించగల సత్తా ఉన్న ఆ మంచి పనులు 2004 సాధారణ ఎన్నికల్లో మటుకు ఆయన పార్టీని ఎందుకు గెలిపించలేకపోయాయి ? దీనికొకటే కారణం.అప్పుడు రాష్ట్రాన్ని మూడేళ్ళ పాటు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు అతలాకుతలం చెయ్యడం. నాయుడుగారి గురించి మంచిగా మాట్లాడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేకపోవడం.ఇప్పుడు వానలు బాగానే కురుస్తున్నా శేఖర్ దాదా మూడేళ్ళ పాలన మిగిల్చిన మధురస్మృతులేవీ లేకపోవడం.అందుచేత ప్రజలు నాయుడుగారి పరిపాలనని పదేపదే గుర్తుతెచ్చుకోవడం.వాళ్ళు అలా గుర్తుతెచ్చుకుంటున్నారని ఆయనకు తెలియడం.నాయుడుగారి గురించి భావి చరిత్రకారులు ఏం రాస్తారో నాకు తెలీదు.కాని ఆయన సదుద్దేశాలు అపార్థానికి గురైనట్లు ఇంకే నాయకుడివీ గురికాలేదు.తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రదేశపు అధికార పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.దాన్ని ఆయనకున్న అధికార దాహంగా వర్ణించడానికి సాహసించినవాళ్ళున్నారు.పార్టీలో చీలికలు రాకుండా చూడ్డానికి ఆయన కొంతమందిని దూరంగా ఉంచాల్సి వచ్చింది.దాన్ని ఆయన నిరంకుశత్వంగా భావించినవాళ్ళున్నారు.చదువుకున్న మధ్యతరగతి యువకులు పెడమార్గాలు తొక్కడానికి నిరుద్యోగమే కారణమనీ, ఉద్యోగావకాశాలు పెంచాలంటే కంప్యూటర్ రంగం అందించే అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనీ సంకల్పించిన గొప్ప దార్శనికుడాయన.రాజీవ్ గాంధిగారి కంప్యూటర్ యుగం గావుకేకలు కేవలం కేకలకే పరిమితం కాగా నాయుడుగారు ఆచరణాత్మకంగా చేసి చూపించారు.చదువుకున్న యువకుల గురించి తాను పడిన తపనలో పేదవర్గాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న నిష్కారణమైన, అన్యాయమైన నిందల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.ఆ అపనిందలకి ఆయన్ని అధికారపీఠం మీంచి లాగి కిందపడేసేంత శక్తి ఉందని అప్పట్లో ఆయన అభిమానులెవరూ ఊహించలేకపోయారు.కాని అబద్ధానికి నోరు పెద్దదని అనంతర చరిత్ర నిరూపించింది.
నాయుడుగారు తన హయాంలో తెలుగు యువలోకంలో రగిలించిన కంప్యూటర్ యుగ స్ఫూర్తి, దాని ప్రభావం, విస్తృతి ఎంతటివో సరిగ్గా అంచనా వెయ్యడం కష్టం.యువతను ఇంతగా ప్రభావితం చేసిన ముఖ్యమంత్రి అంతకుముందెప్పుడూ లేడు.ఆయన హయాం తొలినాళ్ళలో నేను కిరాయికున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారినప్పుడు నా కంప్యూటర్‌ని మోసిన కూలీ దాని configuration వివరాలడుగుతూంటే నేనాశ్చర్యపోయాను.అతనిది శ్రీకాకుళమట.నాయుడుగా రొకసారి శ్రీకాకుళం వచ్చినప్పుడు అందరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, దేశ భవిష్యత్తు దానిమీదనే ఆధారపడి ఉందనీ ఉపన్యాసమిచ్చారట.అది విని 9 వ తరగతి మాత్రమే చదివిన ఆ కూలీ కష్టపడి MS-Office నేర్చుకున్నాడట.నాయుడుగారు తక్కువ మాట్లాడేవారు.ఎక్కువ పనిచేసేవారు.తన పార్టీవాళ్ళైనా సరే, రాజకీయ నాయకుల్ని కాక చదువుకున్న అధికారుల్నే నమ్మేవారు.విద్యార్థులు పూర్తిగా తమ వ్యాసంగానికే (career) అంకితం కావాలనే సదుద్దేశంతో ఆయన పార్టీకున్న విద్యార్థి విభాగాల్ని రద్దుచేసి కళాశాలల్లో రాజకీయాల్ని నిషేధించడంతో తానే చివరికి నవయువత మీద పట్టు కోల్పోయారు.కొత్తగా వోట్లు వచ్చిన 18 ఏళ్ళ యువతకు అప్పట్లో నాయుడుగారి విషయం తెలీదు.వాళ్ళ దృష్టిలో నాయుడుగారు తమ చిన్నప్పటినుంచి అధికారంలో ఉన్న వ్యక్తి.అందుచేత ఈసారి వైవిధ్యంగా వేరే పార్టీకి వోటేద్దామనుకున్నారు.చేసిన కృషి గురించి చెప్పుకోలేకపోవడం ఆయన జీవితంలో ఘోరపరాభవానికి దారితీసింది.అప్పట్లో నాయుడుగారి ఉద్దేశాల గురించి ప్రత్యర్థులు అనవసరమైన చాకిరేవుపెట్టి జనంలో అనుమాన బీజాలు రేకెత్తించడంలో సఫలీకృతులయ్యారు.నాయుడు మళ్ళీ అధికారంలోకొస్తే అంతటా ప్రైవేటు మెడికల్ కాలేజీలే నని గగ్గోలు పెట్టి మెడికోల్ని రెచ్చగొట్టారు.ఇప్పుడు ఉన్న మెడికల్ సీట్లు కూడా రద్దైపోవడానికి మాత్రం కారణం తామే.ఈసారి నాయుడొస్తే రిటైర్‌మెంట్ బెనిఫిట్సు ఉండవని ఊదరగొట్టారు.కాని చివరికి అవి లేకుండా చేసింది మాత్రం తామే.నాయుడొస్తే ఆర్టీసీ ప్రైవేటైపోతుందని ఆర్టీసీవాళ్ళని రెచ్చగొట్టారు.ఇప్పుడు డిపోలు మూసేస్తున్నది మాత్రం తామే.నాయుడొస్తే ఎస్సీలకూ బీసీలకూ ఉపకార వేతనాలు ఉండవన్నారు.ఎగ్గొట్టింది మాత్రం తామే.ఇప్పుడు వందలాది బళ్ళూ కాలేజీలూ మూసేసే పనిలో ఉన్నారు.పైగా ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులివ్వకుండా మూడేళ్ళ నుంచి పేద దళితుల పొట్టలు ఎండగొట్టారు.ఏదైతేనేం - ఆ భస్మాసుర హస్తాల దెబ్బకు ముందు నాయుడుగారు, తరువాత ప్రజలూ బలయ్యారు.

ప్రజలు ఇప్పుడిప్పుడే మేలుకుని నాయుడుగారి పరిపాలన మంచిచెడ్డల గురించి పునరాలోచిస్తున్నారు.నాయుడుగారి దశ కూడా ఒక ఏడాది తరువాత మెరుగుదల చూపిస్తుంది.ఆయనకీ దురదృష్టయోగం 2002 పూర్వార్థంలో మొదలైంది.ఇది ఆయన స్థాయి మనిషికి ఎంత అపకారం చెయ్యాలో అంతా చేసింది.అపకీర్తి, నీలాపనిందలు,హత్యాప్రయత్నం, పదవీభ్రష్టత, ఇరవై ముప్ఫై వ్యాజ్యాలు, బలమైన అనుచరులకు భంగపాట్లు, వారిలో ఇద్దరికి కారావాసం, ఒక మాజీ మంత్రితో సహా 130 మంది స్థానిక తెలుగుదేశం నాయకులు హత్యలకు గురికావడం, సహచరుల ఇళ్ళపై ఆదాయంపన్ను శాఖ దాడులు - ఇటువంటి దురదృష్టాల జాబితా చాలా పెద్దది.

సాధారణంగా ఏడున్నర సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితి ముగిసి చంద్రుడికి గ్రహణం విడుస్తుంది.అయితే అంతకు ఒక సంవత్సరం ముందు నుంచే పరిస్థితి అనుకూలంగా మారిపోవడం మనం గమనిస్తాం.కీలకమైన సంవత్సరాలలో నాయుడుగారి సారథ్యం ఆంధ్రదేశానికి చాలా అవసరం.ఆయనకొక చారిత్రిక పాత్రని భగవంతుడు సిద్ధపరచి ఉంచాడు.నాయుడుగారికి ఆయన వంశానికీ పుత్రపౌత్రాభివృద్ధిగా సకలాయురారోగ్య ఐశ్వర్యములు కలుగు గాక.

3 వ్యాఖ్యలు:

Ram Kumar Tenneti said...

మా బాగా చెప్పారు తాడేపల్లి వారు. మంచి విశ్లేషణ. కానీ ఇది చూసి కొంతమంది జనాలు అనవసర వ్యాఖ్యానాలు చేస్తారు. ఇది ఖచ్చితమయిన నిజం. కానీ మీరేమీ అనుకోవద్దు అండి. చక్కగా ఇలాగే రాయండి

చదువరి said...

నాయుడిపై మీ విశ్లేషణలో కొన్ని నిజాలను చక్కగా వివరించారు. ఆయన అధికారం చేపట్టిన సందర్భాన్నీ, పద్ధతినీ వెన్నుపోటుగా విమర్శించడం మీరన్నట్టు ఆయన్ని అపార్థం చేసుకోవడమే కాదు, తెలుగుదేశపు పతనాన్ని చూడలేకపోయామే అని నిరాశచెందిన వారి వగపు కూడా.

ఐటీని, కొత్త సాంకేతికతను ప్రోత్సహించి ఆయా రంగాల్లో మన అభివృద్ధికి నాయుడే కారకుడు, చోదకుడూ అయ్యాడని మీరన్నమాటా వాస్తవమే.

అయితే మీరు కొన్ని విషయాలను తలచలేదు. ఆయన్ను ప్రజలు అపార్థం చేసుకున్నారని అన్నారు తప్ప ఆయన చేసినవి తప్పని అనలేదు.సమాజంలో కొన్ని ప్రధాన రంగాలను పక్కనపెట్టాడు. (గోదావరి పుష్కరాలకు ఖర్చు పెట్టిన మాత్రం పులిచింతల కోసం ఖర్చు పెట్టలేకపోయాడే అని బాధపడ్డ "దేశా"భిమానులు ఉన్నారు.) ఆర్థిక వ్యవస్థకు కొత్త హంగులను సమకూర్చబోయి, ఆయువుపట్లను విస్మరించాడు.

ఒక్కటి మాత్రం నిజం - గత ప్రభుత్వం ఇప్పటిదాని కంటే ఎంతో మెరుగు. రోజురోజుకూ ఇది ప్రమాదకరంగా తయారవుతోంది.

koumudi said...

Prabhutava udyogulni vaaru teesukunna jeetaaniki saripada pani cheyinchinanduku odipoyaremo..

Mana manager mana kanna ekkuva pani cheste manam sahinchagalama , vaadikanna manam ekkuva pani cheyalsi vastundi kadaa mari ..

Ika farmers vishayaniki vaste, oollallo current lines meeda maatrame power use chesukovatam alavatu paddavallaki aayana ela ruchistadu cheppandi.

Nenu hyderabad vachina kotatlo, maa inti owner kaneesam 1 year vidyut bakaayilu chellinchakundaa manage chestoo undevaaru.Antekaadu, reading tiragakundaa enno rakala paddatulu vaadevaru. Babu Govt vachaka, meter ni seal chesi monthly billing pettaka telisindi aayana oohinchina samskaranala power ento.