విషయం : కార్తీక మాహాత్మ్యంలో ఒక అధ్యాయం
భాష : సంస్కృతం
లిపి : తెలుగు
రచయిత : వేదవ్యాసుడు
నా దస్తూరి బావుంటుందని చిన్నప్పుడు అందరూ అనేవారు.నేను మొదట్లో అచ్చుపుస్తకాల్ని ఎక్కువగా అనుకరించేవాణ్ణి.తరువాత సొంతంగా కొన్ని ఖతులు (fonts)కూడా రూపొందించాను.ఎప్పటికైనా వాటిని కంప్యూటర్‌కెక్కించాలని నా ఆశ.దస్తూరి మాటెలా ఉన్నా పట్టి పట్టి రాయడం మూలంగా పద్ధెనిమిదేళ్ళకే "నిను వీడని నీడను నేనే"అంటూ కళ్ళజోడు సంప్రాప్తించింది.నా అక్షర సౌందర్యారాధన కారణంగా పరీక్షల్లో రాయగలిగినంత రాయలేక తక్కువ మార్కులు తెచ్చుకోవడం కూడా జరిగేది.నా దస్తూరి ఇదివరకంత బావుందని చెప్పలేను.కాని ఫర్వాలేదనుకుంటా.ఈ వయసులో కూడా నా అక్షరప్రేమ చిన్నప్పటిలానే కొనసాగితోంది.అలాగని అందంగా రాయలేనివారి పట్ల నాకు చిన్నచూపేమీ లేదు.





3 వ్యాఖ్యలు:
చాలా ముచ్చటైన చేతివ్రాతండి మీది. అదృష్టవంతులు :) దీనితో ఫాంటు రూపొందిస్తే ఉపయోగించడానికి నేను సిద్ధం.
ఇంత చక్కని చేతివ్రాతని నేనీమధ్య చూడలేదు! 'దస్తూరి గుణముల కస్తూరి' అని
నేనొక వేటూరి పుస్తకంలో చదివాను. కంప్యూటర్లో తెలుగు వాడకం పెరిగాక
వచ్చిన incidental losses లో చేతితో రాయడం అలవాటు తప్పిపోవడం, తద్వారా
చేతివ్రాత చెడిపోవడం ఒకటి అనుకుంటాను.
చాలా బావుంది మీ చేవ్రాత..పెద్దదిగా చేసి చూసేముందు చేవ్రాతలా లేదు, అచ్చు అచ్చువేసిన రాతలా ఉంది అనుకున్నా...ఈ మధ్యనే తెలుగుపదం గుంపులో చేరాను, తెలుగు భాష మీద మీకున్న పట్టు చూసి ఆశ్చర్యం వేస్తోంది..very impressive!
Post a Comment