Sunday, February 4, 2007
శవాల శర్మ కథ
గుంటూరులో చలపాయిగారి ఇంటికి అల్లంత దూరంలోనే ఉండేది శవాల శర్మగారి ఇల్లు. శవాల శర్మ అనే పేరు వింటూనే ఆశ్చర్యపోయాను. బ్రాహ్మల్లో శవాలు మోసేవారెవరుంటారా ? అని ! శవాల శర్మగారికి ఆ పేరు రావడానికి కారణం శవాలు మొయ్యడం కాదట. ఆయనగారి అసలు పౌరుష నామం "సిపాయి శర్మ". ఎందుకంటే ఆయనకి చదువు గట్టిగా పట్టుబడలేదు. రెండో ప్రపంచ యుద్ధానికని బ్రిటీషు ప్రభుత్వం అదనంగా బలగాల్ని మోహరించాలనుకున్నప్పుడు చాలా మంది ఆంధ్రులు సైన్యంలో చేరారు. వారిలో శర్మగారొకడు. శర్మగారు ఈజిప్టు వెళ్ళి సాధారణ సిపాయి హోదాలో యుద్ధంలో పోరాడాడు. అలనాటి కురు పాండవ యుద్ధంలో లాగానే ఈజిప్టు యుద్ధంలో కూడా సైనికులు రాత్రిపూట పోరాటం నుంచి విరమించి విశ్రాంతి తీసుకునేవారు. తిరిగి తెల్లవారుతూనే పోరాటం మొదలు. అలాంటి సందర్భంలో ఇరుపక్షాలకూ చెందిన మిగతా సైనికులంతా ప్రగాఢనిద్రా పరిష్వంగంలో సేదదీరే సమయంలో శవాల శర్మగారూ ఆయనగారి పాకిస్తానీ మిత్రుడైన జబ్బార్ ఇద్దరూ మేల్కుని ఉండి యుద్ధరంగంలో చచ్చిపడి ఉన్న సైనికుల ఒంటిమీది ఉంగరాలు గొలుసులూ కంకణాలూ పర్సులూ కాజేసేవారు. అలా కాజేసిన సొత్తు ఎలా భద్రపరిచి ఇండియాకి తెచ్చారో తెలీదు. మొత్తం మీద రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ చరిత్ర ఒక మలుపు తిరిగింది. సిపాయి శర్మగారి జాతకం కూడా ఓ మలుపు తిరిగింది. ఆయన ప్రతిష్ఠాత్మకమైన బ్రాడీపేట ప్రాంతంలో వెయ్యి గజాల ఇల్లు కట్టించి అక్కడే స్థిరపడ్డాడు. ఈ సంఘటన తరువాత ఆయన పౌరుష నామధేయం శవాల శర్మగా మారి పోయింది. ఆయన మిత్రుడికి కూడా పాకిస్తాన్‌వారు "శవాల జబ్బార్" అని పేరుపెట్టారో లేదో మనకి తెలీదు.
2 వ్యాఖ్యలు:
బలే తమాషా గా ఉందండి శవాల శర్మగారి కథ.
అర్రే మీరు కామీడికూడా భలే రాశారే. మాకు ఓ శవాల శర్మ కధ ఉంది. కాకపోతే ఈ శవాలశర్మ్ వడ్డీవ్యాపారం. మాకు పరిచయస్తుడు. బ్రాహ్మణుడు వడ్డి వ్యాపారం ఏలా చేయాలో తెలియదయ్యా. నాకెందుకబ్బిందో అబ్బింది. నీకు నేర్పిస్తా అని నా చిన్నతనంలో అనేవాడు.
ఇది చదవంగానే అతను గుర్తొచ్చాడు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.