Wednesday, September 27, 2006

ఆనాటి ఒంగోలు పట్టణం

వెంకటేశ్వర్లుగారు అయిదో తరగతీ ఆరో తరగతీ ఇప్పటి ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలులో చదివారు. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా అనే పేరు లేదు. ఆ పట్టణం కూడా గుంటూరులాగానే కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది. ప్రకాశం జిల్లాలో దక్షిణ ప్రాంతం నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. మొత్తం మీద కోస్తా ఆంధ్రలో విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా నాలుగే జిల్లాలు.(రెండు గోదావరి జిల్లాలు లేవు, ఒక్కటే)

ఆ రోజుల్లో ఒంగోలు ఇప్పటంత పెద్ద పట్టణం కాదు. బస్‌స్టాండు దాటితే ఊరు ఉండేది కాదు. సంతపేటలోనయితే పగలు కూడా దొంగలు కొట్టేలా ఉండేదిట పరిస్థితి. నిజానికి దేశమంతా అలాగే ఖాళీగా ఉండేది. ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా కేవలం 2 కోట్ల 40 లక్షలు మాత్రమే కనుక. వెంకటేశ్వర్లుగారు ఆరో క్లాసు చదివింది అక్కడి A.B.M.హైస్కూల్‌లో. అది ఇప్పుడు కాలేజి అయింది. ఆ స్కూలు ఆ రోజుల్లో వందెకరాలకంటే ఎక్కువ స్థలం కలిగి ఉండేదిట.

అసలు ఇప్పటి ఒంగోలు పట్టణ విస్తీర్ణంలో సగం భూమి ఆ రోజుల్లో "ధారా" కుటుంబానికి చెందిన Estate అట. సదరు ధారావారికి ఆ ఊళ్ళో మొన్నమొన్నటి దాకా ఒక పొగాకు క్యూరింగ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. దాన్ని ఆ వంశానికి చెందిన చిట్టచివరి వారసుడైన ధారా శంకరశాస్త్రిగారు ఇటీవలే (1998 ప్రాంతంలో)10 కోట్ల రూపాయలకి అమ్మేశారని తెలుస్తోంది. శంకరశాస్త్రిగారు ఇంకా ఉన్నారో, లేరో తెలియడంలేదు. శంకరశాస్త్రిగారి తండ్రిగారైన ధారా గోపాలకృష్ణయ్యగారు ఒంగోలు పట్టణానికి ఏకధాటిగా 16 సంవత్సరాల పాటు మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారని వెంకటేశ్వర్లుగారు చెప్పేవారు.

ఒంగోలులో వైదిక బ్రాహ్మలకీ నియోగి బ్రాహ్మలకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒక వైదీకి పేరు ఏదైనా వీథికి పెడితే వెంటనే మునిసిపల్ కౌన్సిల్‌లో మర్నాడు హోరాహోరీ యుద్ధం. మళ్ళీ ఒక నియోగి పేరు ఇంకో వీథికి పెడుతూ మునిసిపాలిటీ నిర్ణయం ప్రకటిస్తేనే ఆ గొడవ సద్దుమణిగేది. అలా పోటాపోటీగా పెట్టిన వైదీకి నియోగి పేర్లతో ఒంగోలు నిండిపోయింది.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.