Monday, September 25, 2006

ఒక అ"బ్బాయి" కథ

వెంకటేశ్వర్లుగారికి చిన్నప్పుడు మఱ్ఱిపూడిలో కంభంపాటి సుబ్రహ్మణ్యం అనే సహాధ్యాయి (classmate) ఉండేవాడు. అతన్ని వాళ్ళమ్మ ఒకసారి అడిగిందట. "ఒరేయ్ !క్లాసులో ఒకడు ఫస్టుబోయ్, ఒకడు సెకండుబోయ్ అని చెప్పుకుంటున్నారు. నువ్వు ఏ బోయ్‌వి రా ?" అని.

"నేను సుబ్బాయిని గదమ్మా !"అన్నాడట కంభంపాటి సుబ్రహ్మణ్యం.

2 వ్యాఖ్యలు:

చదువరి చెప్పారు...

మీ "నాన్నగారి జ్ఞాపకాలు" బాగుంటోంది. ఆ మధ్య ఒక రచయిత్రి (పేరు గుర్తులేదు, పొత్తూరి విజయలక్ష్మి గారా!?).. మన ప్రాంతం గురించిన విశేషాలతో తన చిన్నప్పటి సంగతులు రాసారు - ఈనాడు ఆదివారంలో. ఇంటూరు, యాజలి, బుద్ధాం, బాపట్ల.. ఈ ఊళ్ళన్నిటినీ ప్రస్తావించారామె. ఇదుగో ఇప్పుడు మళ్ళీ మీ రచనలో చూస్తున్నాను. ఇంకా రాయండి.

Dr.isMail చెప్పారు...

బావుందండీ! మీ రచనా శైలి నచ్చింది. పాత సంగతులు నెమరువేస్తూ అక్కడక్కడా నవ్వుల మెరుపులు కురిపిస్తూ మీ నాన్న గారి జ్ఞాపకాలను బాగా రాస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.