1945-46 ప్రాంతం. వెంకటేశ్వర్లు గారు బాపట్ల నుంచి వచ్చి బందరు (నేటి మచిలీపట్నం) హిందూ కాలేజిలో ఇంటర్మీడియట్టు (ఆరోజుల్లో పి.యు.సి. అనేవారు) బైపీసీ తరగతిలో చేరారు. ఆ కాలేజికి వారి నాన్నగారైన తాడేపల్లి శ్రీరాములుగారు ఎప్పుడో 15 ఎకరాలు దానమిచ్చారట. ఆ విషయం ఇప్పుడు అక్కడెవరికీ గుర్తులేదనుకోండి ! ప్రస్తుత ఆర్థికమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్యగారు కూడా అప్పుడు అదే కాలేజిలో చదువుతూండేవారు. అయితే ఆయన వెంకటేశ్వర్లుగారికి జూనియర్. అప్పట్లో ఆయన ఏమీ లేనివాడే. వెంకటేశ్వర్లుగారు మాత్రం 40 ఎకరాలకి వారసుడు. ఆ ధీమాతో వెంకటేశ్వర్లుగారు కాలేజి ఎన్నికల్లో సెక్రటరీ పదవికి రోశయ్యగారితో పోటీపడ్డారు. వెంకటేశ్వర్లుగారి ధీమా పనిచెయ్యలేదు. మొత్తం మీద రోశయ్యగారే గెలిచారు. వెంకటేశ్వర్లుగారు ఎన్నికల్లో పోటీచెయ్యడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా !
ఆ రోజుల్లో అదే కాలేజిలో సక్కుబాయి అనే అమ్మాయి బి.ఏ. చదువుతూండేది. అందమైన అమ్మాయే కాని ఎందుకో చాలా పొగరుగా ప్రవర్తించేది. ఆ పొగరు దించాలని అబ్బాయిలు ఆమె వెంటపడి ఏడిపించేవారు. ఒకరోజు ఆ అమ్మాయికి కనిపించేలా గోడ మీద ఇలా రాశారట:
"SUCK బాయి"
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.